ఫ్రిడ్జ్‌ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి క్రమం తప్పకుండా ఫ్రిడ్జ్‌ని కడిగి శుభ్రం చేయాలి.
తడిబట్టతో తుడిచినంత మాత్రాన ఫ్రిడ్జ్ శుభ్రం కాదు. మంచి క్లీనర్లతో ఫ్రిడ్జ్‌ని కడిగి శుభ్రం చేయాలి.
ఫ్రిడ్జ్ ను శుభ్రం చేసిన తర్వాత.. అందులో కాఫీ పొడి, నిమ్మ, లవంగాలు లేదా కరివేపాకు ఉంచితే దుర్వాసన రాదు.
ఫ్రిడ్జ్‌లో ఆహారపదార్థాలు శుభ్రంగా ఉండాలంటే.. గాలి చొరబడని పాత్రల్లో పెట్టడం బెటర్. ఇలా చేయడం వల్ల ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉండటమే కాకుండా దుర్వాసన కూడా రాదు.
నీటిలో కొంచెం వినెగర్ కలిపి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని ఫ్రిడ్జ్‌లో 6 గంటలు ఉంచాలి.
దుర్వాసన రాకుండా ఉండాలంటే నూనె వాడటం మంచిది. నూనెలో ముంచిన దూదిని ఫ్రిడ్జ్‌లోని ప్రతి అరలో ఉంచాలి.