Beauty Tips: మెరిసే చర్మం కావాలంటే.. ఈ టీ లు తాగాల్సిందే!

Navya G | Published : Oct 17, 2023 4:06 PM
Google News Follow Us

Beauty Tips:అందమైన మెరిసే చర్మం కోసం అందరూ ఆరాటపడతారు.  అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలని టీ రూపంలో తీసుకోవడం ద్వారా మెరిసే అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
 

16
Beauty Tips: మెరిసే చర్మం కావాలంటే.. ఈ టీ లు తాగాల్సిందే!

 చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గాలలో సరైన టీలను తీసుకోవటం ఒకటి. టీ లో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించి సహజంగా మెరుస్తున్న చర్మాన్ని అందించడంలో సహాయపడతాయి. టీ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజెంట్ మరియు..

26

 యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరుస్తూ ఉండేలాగా చేస్తాయి. అలాగే ఇందులో ఉండే పాలి ఫెనాల్స్ శరీరంపై ఉండే మొటిమలని మరియు వృద్ధాప్యంతో పోరాడే రెండు ఆక్సిడెంట్లు. కాబట్టి చర్మానికి మెరుగయ్యే టీలు కొన్ని రకాలు ఇక్కడ చూద్దాం. ఒకటి బ్లాక్ టీ.. ఈ టీ శరీరం యొక్క వాపుతో పోరాడటానికి సహాయపడుతుంది.
 

36

అలాగే చర్మ కణాలను పునరుద్జీవింప చేయటంలో సహాయపడతాయి. మరియు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయటంలో సహాయపడతాయి. అలాగే కాశ్మీరీ కాహ్వా..  ఇది గ్రీన్ టీ ఆకులు మరియు కాశ్మీరీ కుంకుమపువ్వు, దాల్చిన చెక్క మరియు యాలకులతో తయారు చేయబడిన దినుసుల మిశ్రమం.
 

Related Articles

46

 ఇందులో ఉండే ప్రతి పదార్థం వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు టీ ని తాగడం ద్వారా మీరు మెరిసే మరియు అందమైన చర్మాన్ని పొందవచ్చు. అలాగే వైట్ టీ తక్కువ ప్రాసెస్ చేయబడిన టీ. ఇందులో అత్యధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
 

56

 ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచుతుంది, గాయాలను వేగంగా నయం చేస్తుంది. ఇది ఎముకలకు, దంతాలకు కూడా చాలా మంచిది. ఇక మందారం గ్రీన్ టీ అయితే చర్మానికి అవసరమైన మంచి ఉత్పత్తి. మందార పువ్వు మరియు రేకులు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు శరీరం..
 

66

 యొక్క సహజ కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంప్లమెంటలీ లక్షణాలు ఉంటాయి. గ్రీన్ టీ లో ఉండే ఈజిసిజి అనే క్యాటెచల్ కణాలను పునరుత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.

Recommended Photos