Ghee Purity Test: బయట కొనే నెయ్యి స్వచ్ఛమైందో.. కల్తీదో.. ఇలా తెలుసుకోండి!
నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొంతమంది స్వార్థం వల్ల నెయ్యి కూడా కల్తీ అయిపోతోంది. చాలామంది స్వచ్ఛమైన నెయ్యిని ఎలా గుర్తించాలో తెలియక సతమతమవుతుంటారు. ఇంట్లోనే నెయ్యి స్వచ్ఛతను ఈజీగా ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నెయ్యి ప్రయోజనాలు
పోషకాల గని అయిన నెయ్యి.. భారతీయ వంటకాలు, ఆయుర్వేద చికిత్సలో ముఖ్యమైన భాగం. నెయ్యి లాక్టోస్ రహితం కాబట్టి వంటకు అనువైంది. ఇది మెదడు పనితీరుకు మద్దతిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మితంగా తీసుకుంటే నెయ్యి శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం మార్కెట్ కల్తీ నెయ్యితో నిండిపోయింది. ఈ నెయ్యి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మరి మనం కొనే నెయ్యి అసలైందో.. లేదా కల్తీదో గుర్తించే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి చూసేయండి.
మెదడు అభివృద్ధికి..
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, నెయ్యిలో మెదడు అభివృద్ధి, పనితీరుకు అవసరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లం అయిన డోకోసాహెక్సెనోయిక్ ఆమ్లం (DHA) పుష్కలంగా ఉంటుంది. నెయ్యిలో అధిక DHA ఉండటం వల్ల అల్జీమర్స్ వ్యాధి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నెయ్యిలోని విటమిన్ ఎ, ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
నెయ్యి స్వచ్ఛతను ఎందుకు టెస్ట్ చేయాలి?
కల్తీ నెయ్యిలో సాధారణంగా వనస్పతి, పిండి, జంతువుల కొవ్వులు లేదా సింథటిక్ రంగులు వంటి హానికరమైన లేదా నాసిరకం పదార్థాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కొత్త వ్యాధులు రావడానికి కారణం అవుతాయి.
నెయ్యి రంగు:
సాధారణంగా స్వచ్ఛమైన నెయ్యి లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటుంది. లేతగా లేదా పూర్తిగా తెల్లగా ఉంటే అది కల్తీ నెయ్యి కావచ్చు.
నెయ్యి వాసన:
సహజంగానే నెయ్యికి మంచి వాసన, మృదువైన ఆకృతి ఉంటుంది. నెయ్యిని వేడి చేసినప్పుడు ఆ వాసన రెట్టింపు అవుతుంది. వాసన ద్వారా కూడా మనం కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు.
అరచేతితో పరీక్ష:
మీ అరచేతిలో గడ్డకట్టిన నెయ్యిని వేసుకోండి. అది వెంటనే కరిగిపోతే అది స్వచ్ఛమైన నెయ్యి. కరగకుండా అలాగే ఉంటే అది కల్తీ నెయ్యి కావచ్చు.
నీటితో నెయ్యి పరీక్ష:
గది ఉష్ణోగ్రత వద్ద ఒక గ్లాసులో సాధారణ నీటిని నింపి.. దానిలో కొంచెం నెయ్యి వేయండి. అది పైకి తేలితే స్వచ్ఛమైన నెయ్యి. నీటిలో మునిగితే లేదా కలిసిపోతే అది కల్తీ నెయ్యి కావచ్చు.
ఉప్పుతో నెయ్యి నాణ్యత పరీక్ష:
రెండు టేబుల్ స్పూన్ల నెయ్యికి ఒక చిటికెడు హైలురోనిక్ ఆమ్లం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి, 20 నిమిషాల తర్వాత నెయ్యి రంగును చూడండి. రంగు మారితే కల్తీ నెయ్యిగా గుర్తించవచ్చు.
అయోడిన్‌తో పరీక్ష:
మీరు కొనుగోలు చేసిన నెయ్యికి రెండు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని జోడించండి. స్వచ్ఛమైన నెయ్యి, అయోడిన్ తో కలిస్తే రంగు మారదు. కల్తీ నెయ్యి రంగు మారుతుంది.