శృంగారంలో పాల్గొనకున్నా యోనిలో నొప్పి.. కారణం ఇదే కావొచ్చు

First Published Jun 29, 2023, 10:31 AM IST

కొంతమందికి శృంగారంలో పాల్గొంటే యోనిలో విపరీతమైన నొప్పి వస్తుంది. దీనికి యోని డ్రైనెస్ నుంచి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మరికొంతమందికి సెక్స్ లో పాల్గొనకున్నా యోనిలో నొప్పి వస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే..? 

సెక్స్ లో పాల్గొన్నప్పుడే కాదు.. ఇతర శారీరక శ్రమ చేసేటప్పుడు కూడా చాలా మందికి యోనిలో నొప్పి కలుగుతుంది. కానీ దీని గురించి వీళ్లు అస్సలు పట్టించుకోరు. దీనివల్లే చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యగా మారుతుంది. యోనిలో నొప్పి కలగడానికి ఎన్నో ప్రమాదకరమైన కారణాలు ఉండొచ్చంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. అసలు యోనిలో నొప్పి కలగడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

యోని డ్రైనెస్

యోని పొడిబారితే కూడా యోనిలో నొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో లూబ్రికేట్ ను ఉపయోగించకుండా చొచ్చుకుపోయే సెక్స్ లో పాల్గొనడం వల్ల యోనిలో విపరీతమైన నొప్పి వస్తుందట. అంతేకాదు దీనివల్ల యోనిలో గాయం కూడా కావొచ్చు. ఇది భరించలేని నొప్పిని కలిగిస్తుంది. యోని పొడిబారడానికి అతిపెద్ద కారణాలలో ఒకటి శరీరంలో ఈస్ట్రోజెన్ పరిమాణం తగ్గడం. ఈ హార్మోన్ల మార్పుఇబ్బందులకు గురిచేస్తాయి.
 

Latest Videos


పీరియడ్స్

పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పి కలగడం సర్వ సాధారణం. ఈ సమయంలో ఉబ్బరం కూడా ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది ఆడవారికి  పీరియడ్స్ సమయంలో యోని నొప్పి కూడా కలుగుతుంది. నీటి నిలుపుదల రుతువిరతికి ముందు కనిపించే ఒక సాధారణ లక్షణం. దీని వల్ల యోనిలో బరువుగా ఉంటుంది. అలాగే నొప్పి కలుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరికీ కాదు. 
 

vaginal hygiene

ఫైబ్రాయిడ్లు

ఫైబ్రాయిడ్లు గర్భాశయంలో క్యాన్సర్ లేని కణితులు. 30 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న వారిలో 1 నుంచి 3 మహిళలు ఫైబ్రాయిడ్లతో బాధపడుతున్నారు. ఫైబ్రాయిడ్ల నొప్పి కణితి పరిమాణం, స్థానం, దాని పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. ఈ సమస్య కూడా కటిలో అవాంఛిత నొప్పిని కలిగిస్తుంది. అలాగే యోనిలో కుట్లు అనుభూతిని కలిగిస్తుంది. గర్భాశయం లేదా యోని చివరలో ఫైబ్రాయిడ్లు ఉండి.. చొచ్చుకుపోయే సెక్స్ లో పాల్గొంటే యోనిలో భరించలేని నొప్పి వస్తుంది. ఫైబ్రాయిడ్లు గర్భాశయ పొరపై ఒత్తిడిని కలిగిస్తే  పీరియడ్స్ సమయంలో యోని నొప్పి వస్తుంది. 
 

వల్వార్ తిత్తి

వల్వాపై అంటే యోని పెదవులపై గడ్డలు ఉంటే కూడా యోనిలో నొప్పి కలుగుతుంది. దీనిని బార్తోలిన్ తిత్తి అని కూడా అంటారు. మీ యోని బార్తోలిన్ గ్రంథులు ద్రవం ద్వారా మూసుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. బార్తోలిన్ తిత్తి పరిమాణంలో పెద్దదిగా ఉంటే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. యోని నొప్పికి వల్వర్ తిత్తులు కూడా ఒక కారణమే.
 

లైంగిక సంక్రమణ అంటువ్యాధులు

లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు యోని నొప్పికి అత్యంత సాధారణ కారణం. ఇదే కాకుండా యూటీఐ, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వంటి ఎన్నో ఇతర రకాల ఇన్ఫెక్షన్లు కూడా యోనిలో నొప్పి, చికాకును కలిగిస్తాయి. ఈ యూటీఐకి కారణమయ్యే బ్యాక్టీరియా కటి, దిగువ పొత్తికడుపులో భరించలేని నొప్పిని కలిగిస్తుంది. అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు కూడా యోనిలో నొప్పిని కలిగిస్తుంది. 

click me!