అయోధ్య బాలరాముడి సన్నిధిలో దీపం వెలిగించిన యోగి ... వెంటనే చేతికి గిన్నిస్ బుక్ రికార్డ్

By Arun Kumar P  |  First Published Oct 30, 2024, 9:38 PM IST

అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుకలివి. ఈ వేడుకలను యోగి సర్కార్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రాముడి సన్నిధిలో దీపాలు వెలిగించి ఈ వేడుకను ప్రారంభించారు. 


అయోధ్య : 500 ఏళ్ల తర్వాత రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ఇలా ఆ రామయ్య కొలువైన తర్వాత జరుగుతున్న మొదటి దీపావళి ఇది. దీంతో అయోధ్యలో ఈ దీపావళి చాలా ప్రత్యేకంగా మారింది. యోగి సర్కార్ ఈ దీపావళి వేడుకలను చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తోంది. ఇవాళ దీపోత్సవ వేడుకలు, సరయు హారతి ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలు ఒకవైపు ఆధ్యాత్మికతను చాటుతూనే మరోవైపు యోగి ప్రభుత్వ ప్రతిష్టను మరింతగా పెంచింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ ఘనతను ధృవీకరించింది. స్వయంగా యోగి ఈ గిన్నిస్ రికార్డును అందుకున్నారు. 

Latest Videos

undefined

దీపాల వెలుగులో ఆ రామయ్య ఆలయం,సరయునది అందాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య రామాలయంలో దీపాన్ని వెలిగించి ఈ దీపోత్సవాన్ని ప్రారంభించారు. బాలరాముడిని దర్శించుకున్న యోగి ఆయన పాదాల చెంత దీపం వెలిగించారు. అనంతరం ఆలయం బయట కూడా దీపాలు వెలిగించారు. ఆ తర్వాత అక్కడున్నవారు ఆలయ ప్రాంగణంలో వేలాది దీపాలు వెలిగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీలు అనిల్ మిశ్రా, గోపాల్ జీ, వినోద్ జీ తదితరులు పాల్గొన్నారు.

click me!