విలన్ గా భయంకరమైన ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టే కోటా.. అదే ఫేస్ లో కామెడీ పండించి కడుపుబ్బా నవ్వించిన రోజులు ఎన్నో. ఇక ఆడ వేశాలు వేయడానికి కూడా కోటా వెనకాడలేదు. నటన కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు కోటా శ్రీనివాసరాలు. ఇక ఆయన కెరీర్ లో ఎన్నో మరపురాని పాత్రలు ఉన్నాయి. వెయ్యికి పైగా సినిమాలు నటించిన కోట ఆహనాపెళ్లంట, మామగారు, మని, సర్కార్, అబ్బాయిగారు, హలో బ్రదర్ ఇలా చెప్పుకుంటే పోతే అద్భుతమైన పాత్రల లిస్టు ఇంకా వస్తూనే ఉంటుంది.
ఇక ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమాల్లో ఆయనకు మంచి పాత్రలు లభించాయి. అతడు, జులాయ్, లాటి సినిమాల్లో కోటా నటనకు ఫిదా అవ్వనివారంటూ ఉండరు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు.. ప్రస్తుతం వయసు మళ్ళటంటో కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు కోటా శ్రీనివాసరావు. అయినా సరే ఒకరి సాయంతో అప్పుడప్పుడు బయట కనిపిస్తూనే ఉంటారు.
Also Read:నాగ చైతన్య-శోభితా పెళ్లి డేట్ వచ్చేసింది, వివాహ వేడుకలు ఎప్పుడు..? ఎక్కడ..?