కిరణ్‌ అబ్బవరం `క` సినిమా రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 31, 2024, 2:32 AM IST

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `క`. విచిత్రమైన టైటిల్‌తో రూపొందిన ఈసినిమా నేడు వుక్రవారం విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కిరణ్‌ అబ్బవరం ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించాడు. సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. జయాపజయాలతో పోరాడుతూ బిగ్‌ బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు `క` అనే సినిమాతో వస్తున్నారు. ఈ మూవీ ప్రకటించినప్పట్నుంచి ఓ క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుంది. టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

మరోవైపు సినిమాపై తన కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు చెప్పాడు కిరణ్‌ అబ్బవరం. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుందని, గతంలో ఏ సినిమాలో ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరని తెలిపారు. దీంతో సినిమాపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. తన్వి రామ్‌, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సుజీత్‌,

సందీప్‌ దర్శకత్వం వహించగా, చింతా వరలక్ష్మి సమర్పణలో కా ప్రొడక్షన్స్‌, శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మించారు. ఈ మూవీ దీపావళి సందర్భంగా నేడు గురువారం(అక్టోబర్‌ 31)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 
వాసుదేవ్‌(కిరణ్‌ అబ్బవరం) ఒక అనాథ. గురునాథం(బలగం జయరామ్‌) అనాథశ్రమంలో ఉంటూ ఉత్తరాలంటే చిన్నప్పట్నుంచి ఆసక్తి. అలా తనకు చిన్నప్పట్నుంచే పక్క వాళ్ల ఉత్తరాలు చదివే అలవాటుగా ఏర్పడింది. తాను ఉండే అనాథాశ్రమంలోని మాస్టర్ గురునాథం(బలగం జయరామ్‌) ఇంటికి వచ్చే ఉత్తరాలు చదువుతూ ఆనందం పొందుతుంటాడు.

తనకు లేని ఎమోషన్స్ ని ఈ లెటర్స్ ద్వారా పొందుతుంటాడు. విషయం తెలిసి ఆ మాస్టర్‌ వాసుదేవ్‌ని కొడతాడు. ఆ కోపంతో తన కూతురు ఆసుపత్రి ఖర్చుల కోసం దాచుకున్న డబ్బుని కొట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఉత్తరాలు చదివే అలవాటు వాసుదేవ్‌ని కృష్ణగిరి అనే పల్లెకి పోస్ట్ మేన్‌ ఉద్యోగం చేయడం కోసం వెళతాడు. అక్కడ రంగారావు(అచ్యూత్‌ కుమార్‌) పోస్ట్ మేన్‌గా పనిచేస్తుంటాడు. ఆయన వద్ద టెంపరరీగా పోస్ట్ బాయ్‌ ఉద్యోగం చేస్తుంటాడు.

రంగారావు కూతురు సత్యభామ(నయన్‌ సారిక)ని తొలి చూపుతోనే ప్రేమలో పడతాడు. ఆమెని ప్రేమలో పడతాడు. అయితే తన అలవాటు ప్రకారం ఆ ఊరుకి వచ్చే ఉత్తరాలన్నీ చదువుతుంటాడు. ఈ క్రమంలో ఆ ఊర్లో జరిగే కొన్ని షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి. అందులో ఒకటి మార్నింగ్ ఉదయం ఐదుగంటలకు దేవుడిని మొక్కుకునేందుకు వెళ్లిన అమ్మాయిలు మిస్‌ అవుతుంటారు.

ఊర్లు ఇది పెద్ద రచ్చ అవుతుంది. అదొక మిస్టరీగా ఉంటుంది. ఇలానే ఓ ముసలావిడ వచ్చి సత్యభామకి జాతకం చెబుతూ, మార్నింగ్‌ ఉదయం 5 గంటలకు వెళ్లి పూజలు చేయాలని చెప్పగా, ఆమె వెళ్తుందనే విషయం తనకు ముందే తెలియడంతో వాసుదేవ్‌ ఆమెని రక్షించేందుకు వెళ్తాడు. ఫారెస్ట్ లో అమ్మవారు విగ్రహం వద్ద సత్యభామని కొందరు దుండగులు కిడ్నాప్‌ చేస్తుండగా వాళ్ల నుంచి ఆమెని కాపాడతాడు. ఈ క్రమంలో ఊర్లో అమ్మాయిల కిడ్నాప్‌కి కారకులు ఎవరో తెలుస్తుంది.

మరి దానికి కారణం ఎవరు? సత్యభామతో తమ ప్రేమ వ్యవహారం ఎలాంటి మలుపు తిరిగింది. ఊర్లో జనం అంతా వణికిపోయే లాలా ఎవరు? వాసుదేవ్‌ని కిడ్నాప్‌ చేసి ఇన్వెస్టిగేటివ్‌ చేస్తున్న మాస్క్ మేన్‌ ఎవరు? తాను ఉండే గదిలోనే పక్క రూమ్‌లో రాధా(తన్వి రామ్‌) ఎందుకుంది? ఆమెని ఎందుకు కిడ్నాప్‌ చేశారు. మాస్క్‌ మేన్‌ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ నిజాలేంటి? ఆ ఊర్లో జరుగుతున్న అతిపెద్ద వ్యాపారం ఏంటనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 
కిరణ్‌ అబ్బవరం ఇటీవల చేసిన సినిమాలపై విమర్శలు వచ్చాయి. ఆయన్ని బాగా ట్రోల్‌ చేశారు కూడా. దీంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తాను ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సినిమా రాలేదని, క్లైమాక్స్ కొత్తగా ఉంటుందని, ఇలాంటి క్లైమాక్స్ ని ఇప్పటి వరకు చూసి ఉండరని తెలిపారు. అలా అనిపిస్తే సినిమాలు మానేస్తా అన్నాడు కిరణ్‌.

అతను చెప్పిన మాటలు నిజమే అని సినిమా చూస్తే అనిపిస్తుంది. ఓ సరికొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూడొచ్చు. ఈ మూవీకి అదే హైలైట్‌. ఆ ఎపిసోడ్‌ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వచ్చే ట్విస్ట్ మైండ్‌ బ్లాక్ అనేలా ఉంటుంది. ఇలా కూడా ఆలోచిస్తారా? ఇలా కూడా సినిమా ఉంటుందా? అనేలా ఉంటుంది. ఆ టైమ్‌లో గూస్‌బంమ్స్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. అయితే సినిమాని క్లైమాక్స్ ఆ రేంజ్‌లో ఉంటుంది. సెకండాఫ్‌ బాగానే ఉంటుంది.

ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగుతుంది. కానీ మొదటి భాగంలోనే అసలు మిస్టేక్‌ చేశాడు. సినిమాని ఎలా ప్రారంభించాలో, ఎలా లీడ్‌ తీసుకుని నడిపించాలో అనే విషయంలో ఈ మూవీ రెగ్యూలర్‌గా అనిపిస్తుంది. అదే సమయంలో కన్విన్సింగ్‌గా ఉండవు. వాసుదేవ్‌ని మాస్క్ మేన్‌ మనుషులు కిడ్నాప్‌ చేయడం, ఆయన్ని ఓ చీకటి గదిలో బంధించి నువ్వు ఎవరు? ఏం చేస్తుంటావ్‌, ఆ హత్యలెందుకు చేశాడు, ఉత్తరాలెందుకు చదువుతున్నావ్‌,

అలాంటి అలవాటేంటి? అని ప్రశ్నిస్తుంటే ఓ వైపు క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది. మరోవైపు ఏం జరుగుతుందో అర్థం కాదు. అయితే తన గతం గుర్తు చేసుకునే సన్నివేశాలు, కృష్ణగిరిలో వాసుదేవ్‌ పోస్ట్ మేన్‌గా చేస్తూ ఊర్లో ఏం జరుగుతుందోతెలుసుకోవడం, ఆ ఊర్లో కొన్ని తప్పులు జరుగుతుండటం, అమ్మాయిలు కనిపించకుండా పోవడం వంటి విషయాలు ఈ ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్‌ జరుగుతున్న నేపథ్యంలో అవి ముందుగానే చదివి వాటిని అడ్డుకునే ప్రయత్నం వాసుదేవ్‌ చేయడం సస్పెన్స్ తో కూడిన ఎలిమెంట్లు, ఆద్యంతం థ్రిల్లింగ్‌ఎక్స్ పీరియెన్స్ ని అందిస్తుంటాయి. ఆ ఎలిమెంట్లు వచ్చినప్పుడు కథనం పరుగులు పెడుతుంది. మధ్యలో ఇన్విస్టిగేషన్‌ సన్నివేశాలు వస్తూ ఆ ఫ్లోని దెబ్బతీసేలా అనిపిస్తాయి. 
 

ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. కిరణ్‌ అబ్బవరాన్ని ఇలా చూడటం సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇక ద్వితీయార్తం తర్వాత సినిమా పుంజుకుంది. ఆ ఊర్లో జరిగే తప్పులను అడ్డుకునే క్రమంలో వాసుదేవ్‌ పడే స్ట్రగుల్స్, వాటిని అడ్డుకునేందుకు ఆయన పడే తప క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. ఆయా సన్నివేశాలు ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉంటాయి.

దీంతో సెకండాఫ్‌ తర్వాత కథనం స్పీడ్‌ పెరిగింది. ఇక్కడ కూడా ఇన్విస్టిగేషన్‌ గదిలో వాసుదేవ్‌, రాధాల మధ్య వచ్చే సీన్లు అంతగా నప్పలేదు. కానీ ఎమోషనల్‌గా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు బాగా గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు దర్శకులు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌ మొత్తం ఆద్యంతం థ్రిల్లర్‌ యాంగిల్‌లో సాగుతుంది.

విలన్లని ఆయన ఎదుర్కొనే సీన్లు, ఆ ఊర్లో జరిగే కుట్రలు ఈ క్రమంలో నెలకొన్న డ్రామా ఆద్యంతం రక్తికట్టించేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ ని మాత్రం ఎవరూ ఊహించని విధంగా పెట్టడం విశేషం. అదే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. గూస్‌ బంమ్స్ ఫీలింగ్స్ అని చెప్పొచ్చు. అయితే సినిమాలో చాలా చోట్ల లాజిక్‌ లు మిస్ అయ్యాయి. దీంతో కొంత కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది.

జాతరలో వచ్చే సాంగ్‌ని మరింత భారీగా ప్లాన్‌ చేయాల్సింది.  అదే సమయంలో ఫస్టాఫ్‌ని సరిగా డీల్‌ చేస్తే సినిమా అదిరిపోయేది. ఓవరాల్‌గా మాత్రం సినిమా కిరణ్‌ అబ్బవరంకి మరో స్థాయికి తీసుకెళ్లే మూవీ అవుతుంది. మరోవైపు మూవీ క్లైమాక్స్ కనెక్ట్‌ అయితే సినిమా రేంజ్‌ వేరే లెవల్‌గా ఉండబోతుందని తెలిసింది. పెద్ద రేంజ్‌ మూవీ అవుతుంది. 
 

నటీనటులుః 
వాసుదేవ్‌ పాత్రలో కిరణ్‌ అబ్బవరం చించేశాడు. ఇన్నాళ్లు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈ సినిమాలో ది బెస్ట్ ఇచ్చాడు. డైలాగ్‌ డెలివరీ నుంచి, బాడీ లాంగ్వేజ్‌ వరకు చాలా మారిపోయారు. కొత్తగా కనిపించాడు. నటుడిగా ఆకట్టుకున్నాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. మరో స్థాయికి తీసుకెళ్లాడు. అనేక విమర్శలకు తన నటనతోనే సమాధానం చెప్పాడు కిరణ్‌.

ఇక సత్యభామ పాత్రలో నయన్‌ సారిక అందంగా కనిపించింది. బాగా చేసింది. చీరలో ఎంతో బాగుంది. మరోవైపు రాధా పాత్రలో తన్వి రామ్ సైతం అదరగొట్టింది. ఆమె పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అచ్యూత్‌ కుమార్‌ తనదైన పాత్రలో మెప్పించారు. మిగిలిన పాత్రధారులుగా సైతం ఆకట్టుకున్నారు. ఊహించని పాత్రలు ఇచ్చే ట్విస్ట్ లు హైలైట్‌గా నిలుస్తాయని చెప్పొచ్చు. 
 

టెక్నీషియన్లుః 
సినిమాకి మ్యూజిక్‌ పెద్ద హైలైట్‌. శ్యామ్ సీఎస్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. మామూలు సీన్లు కూడా హైలైట్ అయ్యాయి. పాటలు సైతం బాగున్నాయి. జాతరసాంగ్‌ ఇంకా బాగా చేయాల్సింది. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ని క్యాప్చర్‌ చేసిన తీరు సూపర్‌. ఆర్ట్ వర్క్ ఈ మూవీలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీ కోసం ఓ ఊరునే క్రియేట్‌ చేసినట్టుగా ఉంది. నిర్మాణ విలువలకు కొదవ లేదు.

దర్శకులు సుజీత్‌, సందీప్‌ ఈ మూవీని ఈ రేంజ్‌లో తీస్తారని ఊహించలేదు. సినిమాకి స్క్రీన్‌ ప్లే హైలైట్‌గా నిలుస్తుంది. క్లైమాక్స్ మరో లెవల్‌. క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ పార్ట్ అనేది అల్టీమేట్‌. మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉంది. అక్కడే ఈ దర్శకుల టాలెంట్‌ ఏంటో అర్థమవుతుంది. అయితే ఎడిటర్‌ మిస్టేకా? దర్శకుడు కన్ఫ్యూజన్‌ అయ్యాడా? కానీ కొన్ని సీన్లలో లాజిక్‌లు మిస్ అయ్యాయి. థ్రిల్లర్‌ ఎలిమెంట్లు ఇంకా బాగా పెట్టాల్సింది. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ లేకుండా చూసుకుంటే సినిమా అదిరిపోయేది. 

ఫైనల్‌గాః `క` ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌. మైండ్‌ బ్లోయింగ్‌ క్లైమాక్స్. అది కనెక్ట్ అయితే సినిమాని ఎవరూ ఆపలేరు.

రేటింగ్‌ః 2.75
 

Read more: నిక్‌ నేమ్‌తో ప్రయోగం చేసి బోల్తా పడ్డా మహేష్‌ బాబు.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ సినిమా ఏంటో తెలుసా?

Latest Videos

click me!