డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే ఏం చేయాలి?

First Published Mar 2, 2024, 10:41 AM IST

గర్భంతో ఉన్నప్పుడు ఆడవాళ్లు పుష్టిగా తింటారు. దీనివల్ల వారి బరువు బాగా పెరిగిపోతుంది. కానీ బరువు తగ్గాలని డెలివరీ అయిన వెంటనే వ్యాయామం చేయకూడదు. మీ స్టామినాను బట్టి వ్యాయామం చేయాలంటారు నిపుణులు. కొన్ని సింపుల్ టిప్స్ తో డెలివరీ తర్వాత ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎలాగంటే? 
 

weight loss

ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే బాగా ఫుడ్ ను కూడా తీసుకుంటారు. మంచి ఫుడ్ తిన్నప్పుడే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడు. కానీ పుష్టిగా తినడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతారు. డెలివరీ తర్వాత కొంతమంది బరువు గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది మీ బరువును మరింత పెంచేసి ఎన్నో రోగాలబారిన పడేస్తుంది. మరికొంతమంది మాత్రం బరువు తగ్గాలని డెలివరీ అయిన వెంటనే కొన్నిరోజుల గ్యాప్ లో వ్యాయామం చేస్తుంటారు. కానీ డెలివరీ అయిన 12 వారాల వరకు వ్యాయామం చేయకూడదు. ఈ సమయంలో బాగా విశ్రాంతి తీసుకోవాలి. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా విశ్రాంతి చాలా చాలా అవసరం. 

ఈ మూడు నెలల్లో తల్లిగా వారిదృష్టి మొత్తం పిల్లల సంరక్షణపైనే ఉంటుంది. కానీ మీరు వ్యాయామం చేయాలనుకుంటే మాత్రం 3 నెలలు ఆగాలి. ఇంతకంటే ముందు వ్యాయామం చేయకూడదు. మీరు వ్యాయామం చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీ ఒత్తిడి స్థాయిలు, భావోద్వేగ ఉద్వేగాలపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
 

బిడ్డకు తల్లిపాలివ్వడం వల్ల మీ శక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా తింటారు. డెలివరీ అయిన వెంటనే బరువు పెరగడం, బెల్లీ ఫ్యాట్, మచ్చల గురించి ఆలోచించకూడదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే మీ మనస్సులో నుంచి తీసేయండి.  మొదటి త్రైమాసికంలో మీరు మీ బిడ్డతో ఎక్కువ సమయం గడపడం అవసరం. ఈ సమయంలో మీరు శరీర ఆకృతి గురించి జాగ్రత్తలు తీసుకోకూడదు.

తల్లి పాలిచ్చేటప్పుడు పౌష్టికాహారాన్ని ఖచ్చితంగా తీసుకోండి. బిడ్డకు పాలివ్వడానికి మీరు అదనంగా 600 కేలరీలను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కూరగాయలు, పండ్లు, మూడు గ్లాసుల పాలను తాగండి. నీళ్లను కూడా ఎక్కువగా తాగాలి. తల్లిపాలలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సరిగ్గా నిద్ర ఉండదు. కాబట్టి వీలున్నప్పుడల్లా కంటినిండా నిద్రపోండి. 
 

మూడు నెలల తర్వాత ఏం చేయాలి? 

బరువు తగ్గాలనుకుంటే మీరు ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. రోజుకు కనీసం 8,000 నుంచి 10,000 అడుగులు నడవండి.

మీరు జిమ్ కు వెళితే మరీ ఎక్కువగా కష్టపడకండి. 

సైక్లింగ్, జాగింగ్ వంటివి చేయండి. 

డెలివరీ తర్వాత కండరాలు, కణజాలాలకు గాయమవుతుంది. 

అలాగే గర్భాశయం సాధారణ స్థితికి రావాలి. ఇందుకు ఆరు వారాల సమయం పడుతుంది.

మూడు నెలల తర్వాత గైనకాలజిస్టును సంప్రదించిన తర్వాతే వ్యాయామం స్టార్ట్ చేయాలన్న విషయాన్ని గుర్తించుకోండి. 

click me!