దీపికా పదుకొనే నుంచి హేమా మాలిని వరకు.. బాలీవుడ్ హీరోలను పెళ్లాడిన సౌత్ స్టార్ హీరోయిన్స్..

First Published | Nov 26, 2024, 8:34 PM IST

సౌత్ నుంచి చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ లో సత్తా చాటారు. అంతే కాదు బాలీవుడ్ స్టార్ హీరోలతో ప్రేమలో పడి పెళ్లాడారు. దీపికా పదుకునే నుంచి హేమా మాలిని వరకు ఉత్తరాది హీరోలను పెళ్లి చేసుకున్న సౌత్ హీరోయిన్లు ఎవరంటే..? 

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కు ఎంతో మంది హీరోయిన్లు వలస వెళ్ళారు. స్టార్లుగా వెలుగు వెలిగారు. అంతే కాదు బాలీవుడ్ స్టార్ హీరోలను ప్రేమలో పడేసి..పెల్ళాడి ముంబయ్ లో సెటిల్ అయ్యారు. దీపికా,ఐశ్వర్య రాయ్ లాంటి వారు ఈ కోవలోనివారే. ఇంకా ఈలిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే. 

Also Read: ప్రభాస్ డ్రీమ్ రోల్ ఎంటో తెలుసా..? ఇప్పటికీ ఆ పాత్ర కోసం ఎదరుచూస్తోన్న రెబల్ స్టార్..

దీపికా, రణవీర్ వివాహం

సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో స్టార్ గా మారిన హీరోయిన్లలో దీపికా పదుకునే ఒకరు. ఆమె  సింధీ కుటుంబానికి చెందిన రణవీర్ సింగ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. మంగుళూరుకు చెందిన  కొంకణి మాట్లాడే కుటుంబానికి చెందిన దీపికా పదుకొనే రణ్ వీర్ తో పెళ్ళి తరువాత ముంబయ్ లో సెటిల్ అయ్యారు. 

Also Read: ముంబయ్ హీరోయిన్ తో సీక్రేట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో నాగార్జున ప్రకటన.


ఐశ్వర్య, అభిషేక్ వివాహం

అభిషేక్ బచ్చన్ కర్ణాటకలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే బంట్స్ కుటుంబానికి చెందిన ఐశ్వర్య రాయ్‌ని వివాహం చేసుకున్నారు. మాజీ విశ్వ సుందరిని వివాహం చేసుకున్న బచ్చన్‌కు ఆరాధ్య అనే కూతురు ఉంది. మోడల్ గా, మిస్ యూనివర్స్ గా , హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 

Also Read: అభిషేక్ తో నటించనని చెప్పిన ఐశ్వర్య రాయ్, డివోర్స్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా..?

శిల్పా, రాజ్ కుంద్రా వివాహం

నటి శిల్పా శెట్టి కూడా మంగళూరుకి చెందిన అమ్మాయే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. బాలీవుడ్ కు చెందిన నిర్మాత రాజ్ కుంద్రా తన మొదటి భార్య కవిత కుంద్రాకు విడాకులిచ్చి శిల్పా శెట్టిని 2009 నవంబర్ 22న వివాహం చేసుకున్నారు. వారి వివాహం మంగళూరు సంప్రదాయం ప్రకారం జరిగింది.

Also Read: ధనుష్ రోలెక్స్ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా..? 2BHK ఇల్లే కొనొచ్చు

శ్రీదేవి, బోనీ కపూర్

ఇక అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  , పంజాబీ కుటుంబానికి చెింది బాలీవుడ్  నిర్మాత బోనీ కపూర్ తమిళనాడులోని శివకాశిలోని మీనంపట్టికి చెందిన శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. ఇలా శ్రీదేవి ఉత్తరాది కోడలు అయ్యింది. 

హేమమాలిని, ధర్మేంద్ర

బాలీవుడ్‌లోని సీనియర్ హీరో ధర్మేంద్ర నటి హేమ మాలిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందిన హేమామాలిని క్లాసికల్ డాన్సర్. ఆమె నృత్యం చూసి మంత్రముగ్ధుడయ్యాడు ధర్మేంద్ర. వెంటనేప్రేమలో పడిపోయాడట. 

విద్యా బాలన్, సిద్ధార్థ్

విద్యా బాలన్ కూడా సౌత్ హీరోయినే. ఆమె  సిద్ధార్థ్ రాయ్ కపూర్ ప్రేమించి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. విద్యా తమిళ అయ్యర్ కుటుంబానికి చెందినవారు, కానీ సిద్ధార్థ్ పంజాబీ కుటుంబానికి చెందినవారు. ఇలా సౌత్ హీరోయిన్లు చాలామంది బాలీవుడ్ స్టార్స్ ను ప్రేమించి పెళ్ళాడారు. 

Latest Videos

click me!