చెలామణిలోకి భారీగా రూ.500 నకిలీ నోట్లు! అసలువేవో, నకిలీవేవో గుర్తించడం ఎలా?

First Published | Nov 26, 2024, 8:23 PM IST

గత 5 సంవత్సరాల్లో ₹500 నకిలీ నోట్లలో 317% పెరుగుదల నమోదైంది.  ₹500 నోటు నకిలీ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో మన వద్దకు వచ్చే నోటు అసలైనదా లేక నకిలీదా అని ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

Fake Currency

ప్రస్తుతం ప్రతిదీ నకిలీమయం... చివరకు కరెన్సీ నోట్లను కూడా నమ్మే పరిస్థితి లేదు. మన పర్సులో ఉన్న ₹500 నోటు కూడా నకిలీదేమో అని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ₹500 నకిలీ నోట్లలో 317% పెరుగుదల నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదికలు చెబుతున్నాయి.

Fake Currency

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదలచేసిన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పార్లమెంటులో సమర్పించిన గణాంకాల ప్రకారం... 2018-19లో 21,865 మిలియన్ నకిలీ నోట్లు ఉన్నాయి. 2022-23లో 91,110 మిలియన్లకు పెరిగాయి. అయితే 2023-24లో 15% తగ్గుదల నమోదైంది. అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో నకిలీ ₹500 నోట్ల సంఖ్య 85,711 మిలియన్లకు తగ్గింది.

Latest Videos


Fake Currency

2021-22లో నకిలీ ₹500 నోట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2020-21లో 39,453 మిలియన్ నోట్లు ఉండగా, 2021-22లో 79,699 మిలియన్లకు పెరిగింది. అంటే 102% పెరుగుదల. 2023-24లో చెలామణిలో ఉన్న ₹2000 నకిలీ నోట్ల సంఖ్య 166% పెరిగింది. అయితే మొత్తం నకిలీ నోట్ల సంఖ్యలో 30% తగ్గుదల నమోదైంది. 2018-19లో 3,17,384 నకిలీ నోట్లు ఉండగా, 2023-24లో 2,22,639కి తగ్గాయి.

Fake Currency

మొత్తంగా చూస్తే, కొత్త నకిలీ నోట్లు చెలామణిలోకి వస్తున్నాయి. ₹2000 నోటును ఉపసంహరించుకున్న తర్వాత, ₹500 నోటు అత్యధిక విలువ కలిగిన నోటుగా మారింది. దీంతో, ₹500 నోటు నకిలీ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక శాఖ దీనిపై నిఘా పెట్టాయి. మన దగ్గర ఉన్న నోటు అసలైనదా లేక నకిలీదా అని గుర్తించడం చాలా ముఖ్యం.

Fake Currency

₹500 నోటు అసలా, నకిలీయా ఎలా గుర్తించాలి?
* అసలు ₹500 నోటు కొలతలు 22 mm x 150 mm.
* నోటుపై దేవనాగరి లిపిలో 500 అని ముద్రించి ఉంటుంది.
* నోటు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది.
* సూక్ష్మ అక్షరాల్లో 'భారత్', 'ఇండియా' అని రాసి ఉంటుంది.

₹500 నోటు అసలా, నకిలీయా ఎలా గుర్తించాలి?
* 'ఇండియా', 'RBI' అని రాసి ఉన్న కలర్ షిఫ్ట్ విండో ఉంటుంది.
* ₹500 నోటును వంచినప్పుడు, సెక్యూరిటీ థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుండి నీలం రంగుకు మారుతుంది.
* హామీ నిబంధన, గవర్నర్ సంతకం, కుడి వైపున మహాత్మా గాంధీ చిత్రంలో RBI చిహ్నం ఉంటుంది.
* నోటులో మహాత్మా గాంధీ చిత్రం, ఎలక్ట్రోటైప్ (500) వాటర్‌మార్క్ ఉంటుంది.

₹500 నోటు అసలా, నకిలీయా ఎలా గుర్తించాలి?
* నోటు ఎడమ వైపు, కుడి కింది భాగంలో నంబర్ ప్యానెల్ ఉంటుంది.
* కుడి కింది భాగంలో రూపాయి చిహ్నంతో పాటు రంగు మారే ఇంక్ (ఆకుపచ్చ నుండి నీలం)లో విలువ సంఖ్య ఉంటుంది.
* నోటు కుడి వైపున అశోక స్తంభం చిహ్నం ఉంటుంది.
* ₹500 నోటు ఎడమ వైపున నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
* నోటులో స్వచ్ఛ భారత్ లోగో, నినాదం ఉంటుంది.

click me!