మీ దగ్గర ఉన్న రూ.500 నోటు నిజమా? నకిలీయా? ఇలా తెలుసుకోండి

First Published | Nov 26, 2024, 8:37 PM IST

నకిలీ నోట్లు ఎప్పుడైనా, ఎవరి జేబులోకైనా రావచ్చు. మరి అసలైన రూ.500 నోట్లను గుర్తించడం ఎలా? ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని తెలుసుకొంటే అసలు నోటు, నకిలీ నోటును సులభంగా గుర్తించవచ్చు. ఆ టెక్నిక్స్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.2,000 నోట్లను వెనక్కు తీసుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. ఇప్పటికే ఈ నోట్లు వెనక్కు ఇచ్చేయడానికి ఆర్బీఐ అనేక సార్లు డెడ్ లైన్స్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 ప్రత్యేక సెంటర్లలో ఇప్పటికీ రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక రూ. 2 వేల నోట్ల తర్వాత పెద్ద నోటు అంటే రూ. 500 నోటే కాబట్టి దీన్ని భారీ స్థాయిలో నకిలీ చేస్తున్నారు. 

దేశవ్యాప్తంగా నకిలీ నోట్లు దొరుకుతున్న వార్తలు వెలుగు చూస్తున్నాయి. రూ.2000 నోట్లు ఉపసంహరణ తర్వాత రూ. 500 నోటు అత్యధిక విలువ కలిగిన కరెన్సీగా మారింది. నకిలీ నోట్ల గురించి ఇటీవ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. గత ఐదేళ్లలో నకిలీ నోట్లు ఎంత భారీగా పెరిగాయో అందులో ఉంది. ఆ వివరాల ప్రకారం నకిలీ రూ.500 నోట్లు 317% పెరిగాయి. 2018-19లో 21,865 మిలియన్ నకిలీ రూ. 500 నోట్లు ఉండగా, 2022-23లో 91,110 మిలియన్‌కు పెరిగాయి. 2023-24లో 15 % తగ్గి 85,711 మిలియన్లుగా ఉన్నాయి.


2020-21లో 39,453 మిలియన్ నకిలీ రూ. 500 నోట్లు ఉండగా, 2021-22లో 79,669 మిలియన్‌కు రెట్టింపయ్యాయి. 2023-24లో రూ. 2000 నకిలీ నోట్లు 166% పెరిగాయి. మొత్తంగా అన్ని రకాల నకిలీ నోట్ల సంఖ్య 30% తగ్గిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2018-19లో 3,17,384 నకిలీ నోట్లు దొరకగా, 2023-24లో 2,22,639కి తగ్గాయని వివరించింది. 

అయితే ఇప్పటికీ నకిలీ నోట్ల బారిన ఎవరైనా పడవచ్చు. అసలు, నకిలీ నోట్లను గుర్తించడం కష్టం. ఈ పరిస్థితుల్లో అసలు రూ. 500 నోటు లక్షణాలు తెలుసుకోవడానికి RBI ఇచ్చిన టిప్స్ తెలుసుకోవడం చాలా ఉపయోగకరం.

రూ. 500 నోటు సైజు 66 mm x 150 mm ఉంటుంది. దేవనాగరిలో '500' అని రాసి ఉంటుంది. మధ్యలో గాంధీ బొమ్మ, 'భారత్', 'ఇండియా' అనేవి సూక్ష్మ అక్షరాల్లో ఉంటాయి.

రంగు మారే సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటును వంచి చూస్తే ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారుతుంది. గాంధీ బొమ్మకు కుడివైపున వారంటీ, ప్రామిస్, గవర్నర్ సంతకం ఉంటాయి.

వాటర్‌మార్క్‌లో గాంధీ బొమ్మ, '500' విలువ ఎలక్ట్రోటైప్ చేసి ఉంటుంది. సీరియల్ నంబర్ పైనా, కిందా ఉంటుంది. ఈ సంఖ్యలు చిన్నవిగా మొదలై పెద్దవిగా అవుతాయి.

కింది కుడివైపున '500' గుర్తు ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారుతుంది. కుడివైపున అశోక స్తంభం, ఎడమవైపున ముద్రణ సంవత్సరం, 'స్వచ్ఛ్ భారత్' లోగో, నినాదం ఉంటాయి.

Latest Videos

click me!