తిరువళ్లూర్, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, పుదుచ్చేరి, కడలూరు, అరియలూర్, తంజావూర్, పుదుక్కొట్టై, శివగంగ, రామనాథపురం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడలూరు, మయిలాడుతురై జిల్లాల్లో రేపు అత్యంత భారీ వర్షాలు, తిరువళ్లూర్ నుంచి పుదుక్కొట్టై వరకు ఉత్తర తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.