యాక్షన్‌ దెబ్బకి రూట్‌ మార్చిన రామ్‌ పోతినేని.. కొత్త సినిమా ఎలా ఉండబోతుందంటే?

First Published | Nov 26, 2024, 8:50 PM IST

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ పోతినేని కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. యాక్షన్‌ సినిమాల దెబ్బకి ఆయన రూట్‌ మార్చాడు. 
 

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ పోతినేని వరుస పరాజయాల నేపథ్యంలో రూట్‌ మార్చాడు. ఆయన మాస్‌ నుంచి క్లాస్‌ వైపు టర్న్ తీసుకున్నారు. మాస్‌ కమర్షియల్‌ ఎంటరటైనర్‌ `డబుల్‌ ఇస్మార్ట్` మూవీ ఫలితం తేడా కొట్టిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అంతకు ముందు బోయపాటి శ్రీనుతో చేసిన `స్కంధ` మూవీ కూడా ఆడలేదు. అంతేకాదు అంతకు ముందు చేసిన `ది వారియర్స్` కూడా నిరాశ పరిచింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ నేపథ్యంలో రామ్‌ రూట్‌ మార్చాడు. యాక్షన్‌ సినిమాలు, రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు రామ్‌. ఇప్పుడు ఎంటర్‌టైనింగ్‌ సినిమాలతో రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్‌ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

`మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంతో మహేష్‌ బాబు దర్శకుడిగా నిరూపించుకున్నాడు. ఈ మూవీ కూడా మంచి ఆదరణ పొందింది. కామెడీ ఎంటర్ టైనర్‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు రామ్‌కూడా అలాంటి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆడియెన్స్ ముందుకు రావాలనుకుంటున్నారట. 
 


రామ్‌ హీరోగా రూపొందే ఈ మూవీ ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇది రామ్‌ పోతినేని నటిస్తున్న 22వ సినిమా రావడం విశేషం. ఇందులో ఈ ఎనర్జిటిక్‌ స్టార్ సరసన `మిస్టర్‌ బచ్చన్‌` ఫేమ్‌ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.  

ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కుతుందని టీమ్‌ తెలిపింది. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కటి కథ, కథనంతో సినిమా రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని వివరించారు. ఇందులో రామ్‌ మేకోవర్‌ కొత్తగా ఉంటుందని, గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ఆయన కనిపించబోతున్నారని టీమ్‌ తెలిపింది.

ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు కొత్త సంగీత దర్శకులను పరిచయం చేస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ - మెర్విన్ సంగీతం అందించనున్నట్లు టీమ్‌ వెల్లడించింది. తెలుగు తెరపై సరికొత్త మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయబోతున్నారని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతోనైనా రామ్‌ కెరీర్‌ విజయ బాటపడుతుందా అనేది చూడాలి. 

read more: ప్రాంక్‌ వీడియో చేసి అడ్డంగా దొరికిన ప్రియాంక జైన్‌.. బిగ్‌ బాస్‌ నటిపై టీటీడీ సీరియస్‌.. ఏం జరిగిందంటే?
 

Latest Videos

click me!