రుతువిరతి అనేది స్త్రీ జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య వస్తుంది. రుతువిరతి అంటే రుతుక్రమం ఆగిపోవడం. రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు సంతానోత్పత్తి ఉండదు. కాగా కౌమారదశలో ఉన్న మహిళలకు ప్రతి నెలా ఒక ఎగ్ ఉత్పత్తి అవుతుంది. ఇది సంతానోత్పత్తి సహాయపడుతుంది. గర్భం దాల్చకపోతే ఇది పీరియడ్ బ్లడ్ ద్వారా బయటకు పోతుంది. అందుకే స్త్రీలు మధ్య వయస్సు వచ్చే వరకు అండోత్సర్గము చేస్తూనే ఉంటారు. వయసు పెరిగేకొద్ది ఇది ఆగిపోతుంది. దాంతో రుతుస్రావం అవసరం ఉండదు. మెనోపాజ్ సమయంలో మహిళల్లో ఎన్నో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. అవేంటంటే..
చర్మ ఆరోగ్యం
రుతువిరతి తరచుగా చర్మం యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ దశలో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడంతో చర్మం స్థితిస్థాపకత, తేమను నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. ముడతలు ఏర్పడతాయి. అలాగే ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి.
menopause
కొలెస్ట్రాల్
రుతువిరతి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారంతో సహా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే హృదయనాళ వ్యాధుల ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
నిద్ర
రుతువిరతి సమయంలో హార్మోన్ల స్థాయిల్లో మార్పులొస్తాయి. ఇది నిద్ర విధానాలకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఇది రాత్రిపూట చెమట ఎక్కువ పట్టడానికి కూడా కారణమవుతుంది.
బోలు ఎముకల వ్యాధి
రుతువిరతి తర్వాత బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. ఎముక సాంద్రతను నిర్వహించడంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రుతువిరతి తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గుతుంది. ఈ లోపం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల ఎముకల బలహీనపడతాయి. ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి ని తీసుకోండి.
Image: Getty
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు
ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల యోని, మూత్రాశయం కణజాలాలు ప్రభావితం అవుతాయి. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
మానసిక ఆరోగ్యం
రుతువిరతితో సంబంధం ఉన్న హార్మోన్ల మార్పులు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చాలా మంది మహిళలు ఈ దశలో మానసిక స్థితి, చిరాకు, ఆందోళన, నిరాశకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది.