సందీప్ రెడ్డి వంగా నా సినిమాని కాపీ కొట్టి అర్జున్ రెడ్డి తీశాడు. రచయిత సంచలన ఆరోపణలతో కొత్త వివాదం 

First Published | Nov 27, 2024, 6:25 PM IST

టాలీవుడ్ లో మరో కొత్త కాపీ వివాదం తెరపైకి వచ్చింది. అంతకు ముందు శ్రీమంతుడు, ఆ తర్వాత బలగం, మరికొన్ని చిన్న చిన్న వివాదాలు కాపీ రైట్ గురించి మొదలయ్యాయి. డుంగ్రోత్ నాగరాజు అనే రచయిత సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

టాలీవుడ్ లో మరో కొత్త కాపీ వివాదం తెరపైకి వచ్చింది. అంతకు ముందు శ్రీమంతుడు, ఆ తర్వాత బలగం, మరికొన్ని చిన్న చిన్న వివాదాలు కాపీ రైట్ గురించి మొదలయ్యాయి. డుంగ్రోత్ నాగరాజు అనే రచయిత సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై నాగరాజు ఆరోపణలతో విరుచుకుపడ్డారు. 

సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రం తన కథ నుంచి కాపీ చేసి రూపొందించారని నాగరాజు చెబుతున్నారు. టాలీవుడ్ రచయితల సంఘానికి ఆయన ఫిర్యాదు చేస్తూ పోస్ట్ చేశారు. ఆయన ఆరోపణలు ఒకసారి పరిశీలిద్దాం. నేను మన అసోసియేషన్లో శాశ్వత సభ్యుడ్ని... నేను ఎంతో కష్టపడి 2017 సంవత్సరంలో... ఇక సెలవ్  అని ఒక సినిమా సొంతంగా నా డబ్బులతో నిర్మాణం గావించి... రిలీజ్ చేయలేక మూడు నాలుగు థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి...హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్, ఫిల్మ్ ఛాంబర్ లాంటి చోట్ల చాలా షోస్ ప్రదర్శించాను. 


ఇక సెలవ్ చిత్రంలోని కథని సన్నివేశాలని సందీప్ రెడ్డి వంగా యథాతధంగా తన అర్జున్ రెడ్డి చిత్రంలో కాపీ కొట్టాడు. తెలంగాణ మారుమూల గిరిజన బంజారా లంబాడి కుటుంబానికి చెందిన నేను... సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి రచయితగా దర్శకుడిగా నిర్మాతగా నా సొంత డబ్బులతో సినిమా తీస్తే... దాన్ని వంగా సందీప్ రెడ్డి కాపీ కొట్టడం వల్ల నేను తీవ్రంగా నష్టపోయాను. ఇక సెలవ్ చిత్రానికి చేసిన అప్పుల తీర్చలేక ఇప్పటికీ వ్యధ అనుభవిస్తున్నాను. 

గతంలో ఆత్మహత్యకి కూడా ప్రయత్నించా. నా ఆరోగ్యం కూడా క్షీణించింది. అర్జున్ రెడ్డి ఇక సెలవు సినిమాలు చూసి మీరందరూ నాకు న్యాయం చేస్తారని విన్నవించుకుంటున్నాను. రేపు నా ఆరోగ్యం నుంచి నేను చనిపోతే దానికి కచ్చితంగా వంగా సందీప్ రెడ్డి బాధ్యత వహిస్తాడు. అతని మీద S.T అట్రాసిటీ కేసుతోపాటు...నా  మరణానికి ఆత్మహత్య కారణం అయినందుకు చాలా కేసులు పెట్టబడతాయి ఇది బెదిరింపు కాదండి నా బాధ దయచేసి అర్థం చేసుకోగలరు మీ  డుంగ్రోత్ నాగరాజు..లైఫ్ మెంబర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

కొందరు నెటిజన్లు మాత్రం ఇక సెలవ్ చిత్రానికి, అర్జున్ రెడ్డికి పోలికే లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. వారికి నాగరాజు సినిమా చూడడం చేతకాని వెధవలు అంటూ ఘాటుగా బదులిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగపై ఇంకా చాలా ఆరోపణలు చేశారు. మొదట విజయ్ దేవర కొండ సందీప్ రెడ్డి చెప్పిన కథని రిజెక్ట్ చేశాడని.. దిక్కుతోచక నాకథని కాపీ చేసి ఒప్పించాడని నాగరాజు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సందీప్ ఎలా స్పందిస్తాడో అనేది ఆసక్తిగా మారింది. 

Latest Videos

click me!