Prostate Cancer ఈ లక్షణాలు క్యాన్సరేమో..? నిర్లక్ష్యం వద్దు!

ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటున్న ఈ వ్యాధికి ఎన్నో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అయితే క్యాన్సర్ వచ్చే ముందే శరీరం కొన్ని సిగ్నళ్లు అందిస్తుంది. దీని ఆధారంగా మనం జాగ్రత్త పడాలి.  పురుషులను ఈ మధ్య ప్రోస్టేట్ క్యాన్సర్ బాగా బాధిస్తోంది. సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వాళ్లలో వచ్చే ఈ సమస్య ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్లలో కూడా వస్తోంది. ఇలాంటి డేంజర్ రోగం ముందే వచ్చే సూచనలను అస్సలు నెగ్లెక్ట్ చేయకండి.

Prostate cancer early signs every man should know in telugu
డేంజర్ బెల్స్

వయసు పైబడిన వాళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ రావడం సహజం. సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వాళ్లలో వచ్చే ఈ సమస్య మొదలువుతుంది. కానీ దీనికి భిన్నంగా ఇప్పుడు చిన్న వయసు వాళ్లలో కూడా ఈ క్యాన్సర్ వస్తోంది. ఇలాంటి డేంజర్ రోగం ముందే వచ్చే సూచనలను అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అసలు ఆ సూచనలేంటో తెలుసుకోండి.

Prostate cancer early signs every man should know in telugu

ప్రోస్టేట్ గ్లాండ్ వీర్యాన్ని తయారు చేసే, తీసుకెళ్లే సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. 50 ఏళ్ల తర్వాత చాలామంది మగాళ్లలో దీనికి క్యాన్సర్ వచ్చి ప్రాణాంతకం అవుతోంది.  ప్రోస్టేట్ గ్లాండ్ కణాలు కంట్రోల్ తప్పితే క్యాన్సర్ వస్తుంది. ఇందులోనూ చిన్న కణాల కార్సినోమాలు, న్యూరోఎండోక్రైన్ గడ్డ, పరివర్తన చెందిన కణాల కార్సినోమాలు, సార్కోమాస్ అనే రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి.


లక్షణాలు ఇవే..

ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ప్రోస్టేట్ గ్లాండ్ సాధారణంగా మూత్రనాళం దగ్గరే ఉంటుంది. మూత్ర విసర్జనలో ఇబ్బంది లేదా మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం పోయడం, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం.. ఇవన్నీ ఈ క్యాన్సర్ లక్షణాలే..

అంగస్తంభన సమస్యలు రావడం, స్ఖలనం సమయంలో నొప్పి అనిపించడం ఉంటాయి. ముఖ్యంగా మీ మూత్రం అలవాట్లను గమనించండి. ముందుకంటే ఎక్కువసార్లు బాత్రూమ్ కి వెళ్తుంటే అనుమానించాల్సిందే. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

క్యాన్సర్ ఎక్కువైతే
చాలాసార్లు రోగం లేట్ గా కనిపెడితే, సరైన ట్రీట్మెంట్ లేకపోతే క్యాన్సర్ ప్రోస్టేట్ గ్లాండ్ బయట ఎముకలు, శోషరస గ్రంథులకు కూడా పాకవచ్చు. కాళ్లు లేదా నడుములో వాపు, నడుము, కాలు లేదా పాదాల్లో తిమ్మిర్లు, నొప్పి, ఎముకల నొప్పి, విరగడం కూడా జరుగుతాయి. సమయం మించితే కోలుకోవడం కష్టం.

ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే సగటు వయస్సు 68 అని ఉండేది. ఇప్పుడు యంగ్ వాళ్లలో కూడా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో కూడా ఈ క్యాన్సర్ కనిపిస్తోంది. రెగ్యులర్ గా టెస్టులు చేయించుకుంటే, లక్షణాలు తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే బతికే ఛాన్స్ ఎక్కువ. పెద్దవాళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కన్నా యంగ్ ఏజ్ వాళ్లలో ఈ రోగాన్ని తొందరగా గుర్తించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ రెండో అత్యంత కామన్ క్యాన్సర్. మగాళ్లు చనిపోవడానికి ఇది ఆరో ప్రధాన కారణం. నేషనల్ పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రికార్డు ప్రకారం ఢిల్లీ, కోల్‌కతా, పూణే, తిరువనంతపురంలో మగాళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ రెండో ప్రధానమైనది. బెంగళూరు, ముంబైలో క్యాన్సర్ మూడో ప్రధానమైనది.

ముసలితనంలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. లావుగా ఉన్నవాళ్లు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ కూడా క్యాన్సర్ కి మరో కారణం. ఇంట్లోనే పీఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఏదో తేడాగా ఉంటే డాక్టర్ ని కలిసి గుదనాళ పరీక్ష చేయించుకోండి. అక్కడ వాళ్లు ప్రోస్టేట్ ని టెస్ట్ చేస్తారు.

పండ్లు, కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, శరీరానికి తగిన బరువును మెయింటైన్ చేయడం ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం, డైలీ డైరీని తగ్గించడం ఆరోగ్యానికి మంచిది. శారీరకంగా యాక్టివ్ గా ఉండటం కూడా ముఖ్యం. రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకుంటే ఇంకా మంచిది.

Latest Videos

vuukle one pixel image
click me!