కమల్, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన త్రిష, చాలా సంవత్సరాల తర్వాత పేట చిత్రం ద్వారా రజనీకాంత్‌కు జోడీగా నటించారు. సినిమాలతో పాటు యోగా, పెంపుడు జంతువులు, విదేశీ పర్యటనలు ఇలా త్రిషకు ఇష్టమైనవి చాలానే ఉన్నాయి. కేవలం పాటలు, గ్లామర్‌కే పరిమితం కాకుండా, సినిమాకు బలంగా నిలిచి నేటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.