Health Tips: మన వంటగదిలోనే మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాలు ఎన్నో ఉన్నాయని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి ఇప్పుడు.. ప్రకృతిని మనకు ఏది లభించినా.. అది మనకోసం సృషించబడిందే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. తేనే కంటే.. గసగసాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వేసవిలో గసగసాలు తింటే ఒంట్లోని వేడి పోతుందట. అంతేకాదు.. శారీరక, మానసిక బలాన్ని అవి అందిస్తాయట. దీనిలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రస్తుతం ఎండలు మందిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండే ఫ్యాన్ నుంచి వేడి గాలులతో ఒంట్లో వేడి పెరిగిపోతుంది. అలాంటి సమయంలో మన తాతయ్య, అమ్మమ్మ వాళ్లు ఏం ఇచ్చేవారో గుర్తుకు తెచ్చుకోండి. అందరికీ తెలిసినట్లే.. గసగసాల రసం లేదా.. రౌండ్ ముద్దలుగా చేసిన గసగసాల ఉండ. ఇది ఒంట్లో వేడి తగ్గించడంలో దివ్య ఔషధంలా పనిచేస్తుందట. క్షణాల్లో ఒంట్లో వేడిని తగ్గించే శక్తి గసగసలకు ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదంలో కూడా వైద్యానికి వినియోగిస్తారు
గసగసాలను ఆయుర్వేదంలో కూడా వైద్యానికి వినియోగిస్తారు. దీనికి వేల సంవత్సరాల నాగరికత ఉంది. ఇది గ్యాస్ సమస్యలకు కూడా బాగా పనిచేస్తుందని, ఆయుర్వేదంలో మందుల తయారీకి ఉపయోగిస్తారంట. ఇక గసగసాల్లో ఉన్న పోషకాల వల్ల శరీరం వెంటనే చల్లబడుతుందని అంటున్నారు. వేసవిలో కడుపులో చికాకు, పాదాలలో మంట, చర్మం మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి. గసగసాల జ్యూస్ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, మనస్సును కూడా ప్రశాంతతనిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
గసగసాలు పోషకాల నిధి...
శాస్త్రీయ పరంగా చూస్తే.. గసగసాలు పోషకాల నిధి. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. గసగసాలలో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, ఇది వేసవిలో కాలానుగుణ వ్యాధులను నివారిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. గసగసాలలో ఉండే మెగ్నీషియం మంచి నిద్రను ప్రోత్సహిస్తుందని ఒక అధ్యయనం సూచిస్తోంది. పూర్వం రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో గసగసాలు కలుపుకుని తాగేవారు.. అందుకే వారు వెంటనే గాఢ నిద్రలోకి జారుకునేవారని అంటున్నారు. దీంతోపాటు గసగసాలలో ఉండే ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయట. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయట.
ఆయుర్వేదంలో గసగసాల నూనెను నొప్పి నివారిణిగా వినియోగిస్తారట. ఈ ఆయిల్ కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందట. వైద్యులు చెబుతున్న ప్రకారం.. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం గసగసాలు కల్పిస్తాయంట.
చర్మానికి రాయడం వల్ల..
పాలు, గసగసాలు కలిపి చర్మానికి రాయడం వల్ల మొఖంపై పింపుల్స్ తగ్గిపోతాయట. గసగసాలలో ఉండే రోగనిరోధక లక్షణాలు చర్మం మంటను కూడా తగ్గించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం కనుక్కున్నారు. తెలుసుకున్నారు కదా.. వేసవిలో శరీరం డీహైడ్రోషన్‌కు గురికాకుండా ఉండాలంటే.. రోగనిరోధక శక్తి పెరగాలంటే.. గసగసాలు తినడం సరైన ఎంపిక. విదేశాల్లో సైతం గసగసాలను అనేక రకాల రోగాల నిర్మూలను వాడుతున్నారు.