శరీరంలోని కొన్ని భాగాలకు రోజూ నెయ్యి రాసుకుంటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలోని ఈ నాలుగు ప్రదేశాలకు నెయ్యి తప్పకుండా రాసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదంలో నెయ్యిని అమృతంగా భావిస్తారు. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నెయ్యిలో మన శరీరానికి అవసరం అయ్యే చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా ఉంటాయి. మితంగా తీసుకుంటే.. నెయ్యి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు, నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, చర్మానికి కూడా చాలా మంచిది. కానీ చాలామందికి నెయ్యిని ఎలా వాడాలో తెలియదు. తినే పదార్థాల్లో నెయ్యి వాడవచ్చు, కానీ శరీరంలోని కొన్ని భాగాలకు రోజూ నెయ్యి రాసుకుంటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలోని ఈ నాలుగు ప్రదేశాలకు నెయ్యి తప్పకుండా రాసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి, ఏ భాగాలకు నెయ్యి రాస్తే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కళ్ళకు నెయ్యి రాసుకుంటే కలిగే ప్రయోజనాలు: స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఒకటి లేదా రెండు చుక్కలు కళ్ళలో వేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. డ్రై ఐస్ సిండ్రోమ్ సమస్య ఉండదు. కళ్ళలో మంట ఉంటే తగ్గుతుంది. కళ్ళ ఒత్తిడి తగ్గుతుంది, చూపు మెరుగుపడుతుంది.
ముక్కులో నెయ్యి వేసుకోవడం: అవును, మీ ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల నెయ్యి వేసుకుంటే అలెర్జీల నుండి రక్షణ లభిస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది, జలుబు, దగ్గు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ముక్కులో నెయ్యి వేయడం మంచిది.
నాభిపై నెయ్యి రాసుకుంటే కలిగే ప్రయోజనాలు: నాభిని శరీర కేంద్రంగా భావిస్తారు, దీని ద్వారా మొత్తం ఆరోగ్యం నిర్వహించగలం.
రాత్రి పడుకునే ముందు చిటికెడు నెయ్యిని నాభిపై రాసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు. వంధ్యత్వ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది, చర్మం, జుట్టుకు మంచిది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అరికాళ్ళకు నెయ్యి రాసుకుంటే కలిగే ప్రయోజనాలు: రాత్రి పడుకునే ముందు కొద్దిగా నెయ్యిని అరికాళ్ళకు రాసుకుని మసాజ్ చేసుకుంటే మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని భాగాలను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ఇంకోసారి నెయ్యి తినడంతో పాటు శరీరంలోని ఈ నాలుగు భాగాలకు కూడా నెయ్యి రాసుకోండి.