కేవైసీ, నామినీ వివరాలు:
డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్లకు కేవైసీ వివరాలను మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది. నామినీ వివరాలు ధృవీకరించాలి.
హోటళ్లు, రెస్టారెంట్లు:
రూ.7,500 కంటే ఎక్కువ గది అద్దె ఉన్న హోటళ్లలో రెస్టారెంట్ సేవలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది.
ఆదాయపు పన్ను రిటర్న్ గడువు:
అప్‌డేటెడ్ రిటర్నుల గడువు 12 నెలల నుంచి 48 నెలలకు పెరిగింది.
చెక్కు చెల్లింపులు:
రూ.50,000కు మించి చెక్కు చెల్లింపులకు ఎలక్ట్రానిక్ విధానంలో వివరాలు సమర్పించాలి. బ్యాంకు ధృవీకరణ తర్వాత మాత్రమే చెక్కు చెల్లింపు జరుగుతుంది.
యులిప్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ):
రూ.2.5 లక్షలకు పైగా ప్రీమియం చెల్లించిన యులిప్‌ను వెనక్కి తీసుకున్నప్పుడు వచ్చిన లాభంపై పన్ను చెల్లించాలి.