jr ntr, ntr
Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతేడాది `దేవర`తో ఆకట్టుకున్నాడు. త్వరలో `వార్ 2`తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. అలాగే ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో మూవీ చేస్తున్నారు.
`దేవర` జపాన్‌లో రిలీజ్ అయిన నేపథ్యంలో మొన్నటి వరకు అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొని హైదరాబాద్ కి వచ్చారు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చారు. `మ్యాడ్ 2` సక్సెస్ మీట్‌కి గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
adhurs
ఎన్టీఆర్ చేసిన `అదుర్స్` (2010) సినిమా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి కామెడీ రోల్, మరోటి సీరియస్ రోల్. చారిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవల్. ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విశేష ఆదరణ పొందింది.
పెద్ద హిట్ అయ్యింది. అయితే ఆ మధ్య మళ్లీ `అదుర్స్ 2`సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై స్పందించారు ఎన్టీఆర్. `అదుర్స్ 2` లేదనే విషయాన్ని స్పష్టం చేశాడు. ఎందుకు చేయడం లేదో తెలిపారు.
jr ntr, ntr
కెమెరా ముందు కామెడీ చేయడం చాలా కష్టమని తెలిపారు ఎన్టీఆర్. `మ్యాడ్`లో సంగీత్ శోభన్, రామ్ నితిన్ చేసిన కామెడీని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రామ్ నితిన్‌ని చూస్తుంటే ఒకప్పుడు తనని తాను చూసుకున్నట్టు అనిపిస్తుందన్నారు. ఈ క్రమంలోనే అసలు విషయాన్ని బయటపెట్టారు.
కెమెరా ముందు నిల్చోవడం అంత తేలిక కాదు, మ్యాడ్‌లో రామ్ నితిన్ అద్బుతంగా నటించాడు. కామెడీ పలికించడం ఒక యాక్టర్‌కి చాలా కష్టం. అందుకే నేను `అదుర్స్ 2` చేయడానికి ఆలోచిస్తున్నాను` అని తెలిపారు ఎన్టీఆర్. కామెడీ చేయడానికి భయపడి ఈ మూవీ చేయడం లేదని ఆయన వెల్లడించారు.
jr ntr, ntr
ఈ సందర్భంగా సునీల్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు బ్రహ్మానందం కామెడీ అంటే చాలా ఇష్టమని, ఆ తర్వాత ఎమ్మెస్ నారాయాణ, ధర్మవరపు సుబ్రమణ్యంల కామెడీని బాగా ఇష్టపడతానని, వారి తర్వాత సునీల్ కామెడీనే ఇష్టమని చెప్పారు.
`భాష మీద పట్టు ఉంది. అలాగే కింద స్థాయి నుంచి ఎదుగుకుంటూ ఇక్కడికి వచ్చాడు. చాలా కాలం తర్వాత సునీల్ కామెడీ చూసి మళ్ళీ నవ్వుకున్నాను. సునీల్ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. కానీ, నవ్వించడానికే అతను పుట్టాడని నేను నమ్ముతాన`ని చెప్పారు ఎన్టీఆర్.