LSG vs MI: Mitchell Marsh's stormy style! Created a historic record in IPL powerplay
Mitchell Marsh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 16వ మ్యాచ్ లో మిచెట్ మార్ష్ బీస్ట్ మోడ్ లో చాలా హార్ష్ గా దుమ్మురేపుతూ ముంబై ఇండియన్స్ కు దిమ్మదిరిగిపోయే షాక్ ఇచ్చాడు. అతని సూపర్ ఇన్నింగ్స్ తో లక్నో టీమ్ ముంబైని 12 పరుగుల తేడాతో ఓడించింది.
లక్నో ఎకానా స్టేడియంలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) - ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన IPL 2025 మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. పవర్‌ప్లేలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2025: Lucknow Super Giants vs Mumbai Indians
మిచెల్ మార్ష్ పవర్‌ప్లేలో దంచికొట్టాడు !
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఓపెనర్ మిచెల్ మార్ష్ సునామీ ఇన్నింగ్స్ తో చరిత్ర సృష్టించాడు. పవర్‌ప్లేలోని ఆరు ఓవర్లలో 30 బంతులు ఎదుర్కొన్న తొలి బ్యాట్స్‌మన్‌గా మార్ష్ ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించాడు. దూకుడుగా ఆడుతూ స్ట్రైక్ ను తనవద్దనే ఉంచుకుంటూ పరుగుల వర్షం కురిపించాడు.
IPL 2025: Lucknow Super Giants vs Mumbai Indians
మార్ష్ విధ్వంసక బ్యాటింగ్ దెబ్బకు లక్నో టీమ్ మొదటి ఆరు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 69 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. పవర్‌ప్లేలో అర్ధ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా మార్ష్ రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ మార్ష్.
అతను కేవలం 31 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. మార్ష్ కు ఈ సీజన్‌లో ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. IPL 2023లో కైల్ మేయర్స్ రెండుసార్లు పవర్‌ప్లే లోపు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.
LSG తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన మిచెల్ మార్ష్ ప్రారంభం నుండే ముంబై ఇండియన్స్ బౌలర్లపై క్రూరమైన దాడిని మొదలుపెట్టాడు. IPL చరిత్రలో ఆరు ఓవర్ల పవర్‌ప్లేలో 30 బంతులు ఎదుర్కొన్న మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే, కేవలం 27 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని సాధించాడు.
దూకుడుగా ఆడుతున్న క్రమంలో ముంబై ఇండియన్స్ మిస్టరీ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ మిచెల్ మార్ష్‌ను
అవుట్ చేయడంతో అతని తుఫాను ఇన్నింగ్స్ కు ఏడో ఓవర్ లో బ్రేక్ పడింది. పుతూర్ వేసిన బంతిని మార్ష్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, బౌలర్ అద్భుతమైన క్యాచ్ పట్టి పెవిలియన్ కు దారిచూపించాడు.
ఐడెన్ మార్క్రమ్‌తో కలిసి మిచెల్ మార్ష్ మొదటి వికెట్‌కు 76 పరుగులు జోడించి జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించారు. ఐపీఎల్ 2025లో మిచెల్ మార్ష్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో కలిపి 184 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2025లో అతని అత్యధిక స్కోరు 72 పరుగులు.