ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ ఆలోచనలు అంతరిక్షం చుట్టూ తిరుగుతున్నాయి. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా అంతరిక్షంలోకి ప్రైవేటు వ్యోమగాములను పంపే మస్క్ ఇప్పుడు కొత్త ప్రయోగాన్ని ప్రారంభించారు. ఆ ప్రయోగం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బిలియనీర్ ఎలాన్ మస్క్ మంగళవారం స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ తీసిన భూమి ధ్రువ ప్రాంతాల ఫొటోలను మళ్లీ షేర్ చేశారు. "భూమి ధ్రువాల చుట్టూ మనుషులు తిరగడం ఇదే తొలిసారి!" అని మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో రాశారు. అయితే దీని వెనుక ఒక ప్రత్యేక ప్రయోగ లక్ష్యం ఉందని ఆయన మాటల్లో వెల్లడైంది. అదేంటంటే..
మార్చి 31న స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌పై నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 'ఫ్రామ్2' అనే ప్రైవేట్ వ్యోమగామి మిషన్‌ను స్పేస్‌ఎక్స్ ప్రారంభించింది. ఇది "భూమి ధ్రువాల మీదుగా భూమి చుట్టూ తిరిగే మొట్టమొదటి వ్యోమ నౌక."
This is the first time humans have been in orbit around the poles of Earth! https://t.co/mbmKkADED2
— Elon Musk (@elonmusk)ఈ మిషన్‌కు చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్ చున్ వాంగ్ నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో నార్వేకు చెందిన వెహికల్ కమాండర్ జానికే మిక్కెల్సెన్, జర్మనీకి చెందిన పైలట్ రాబియా రోగ్, ఆస్ట్రేలియాకు చెందిన ఎరిక్ ఫిలిప్స్ కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉంటుందో తెలుసా? సునీతా విలియమ్స్ ఏమన్నారంటే..
నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు ఇంతకు ముందు ఎప్పుడూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. ఈ మిషన్ మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటుందని స్పేస్‌ఎక్స్ తెలిపింది.
ఈ మిషన్‌లో వ్యోమగాములు 22 సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తారు. అందులో అంతరిక్షంలో పుట్టగొడుగులను పెంచడం కూడా ఉంది. అంతరిక్షంలో మష్రూమ్స్ పెంచడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తారు. అంతేకాకుండా వారు కక్ష్యలో ఉన్నప్పుడు మానవ శరీరం ఎక్స్-రే కూడా తీస్తారు. ఇలాంటి 22 ప్రయోగాలు ఈ మిషన్ ద్వారా ప్రైవేటు వ్యోమగాములు చేస్తారు.
ఈ ప్రయోగాలన్నీ పూర్తయిన తర్వాత సుమారు 5 రోజుల తర్వాత వారు తిరిగి సముద్రంలోకి దిగడం ద్వారా భూమికి తిరిగి వస్తారని స్పేస్‌ఎక్స్ తెలిపింది.
భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు ఏ సిబ్బంది, అదనపు వైద్య సహాయం లేకుండా డ్రాగన్ వ్యోమనౌక నుండి బయటకు రావాలని నిర్ణయించారు. అయితే ఇది ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి. అంతరిక్షంలో ఉన్న తర్వాత వ్యోమగాములు సహాయం లేకుండా పనులు చేయగలరా లేదా అని తెలుసుకోవడానికి ఇలా చేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది.