ఈ డిజిటల్ లావాదేవీల కాలంలో కూడా చాలామంది నగదును ఇష్టపడతారు. ఇలా నగదు మెయింటైన్ చేసేవాళ్లు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. వాటి వల్ల ఆదాయపు పన్ను శాఖ మీపై దృష్టి పెడుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలని కొంతమంది ఆదాయపు పన్ను శాఖ కన్నుగప్పడానికి నగదు లావాదేవీలు చేస్తారు. చిన్న మొత్తంలో కొనుగోళ్లు చేస్తే పెద్ద సమస్య కాదు. కానీ కొన్ని ఎక్కువ విలువైన లావాదేవీలు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకొనేలా చేస్తాయి.
ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు సాధారణంగా మీరు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లిస్తే, రిజిస్ట్రార్ ట్యాక్స్ అధికారులకు తెలియజేయాలి. లేకపోతే మీకు ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి నోటీసులు అందుతాయి. మీరు సక్రమమైన మార్గంలోనే ఆ ఆస్తిని సంపాదించామని ఆధారాలు చూపకపోతే మీరు చట్టపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో బ్లాక్ మనీ వాడకుండా చూడటానికే అధికారులు ఈ క్రాస్ చెకింగ్ చేస్తుంటారు.
చివరగా క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా పెట్టుబడులకు పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం కూడా ఆదాయపు పన్ను శాఖ పరిశీలనకు వస్తుంది. అంటే ప్రస్తుత రోజుల్లో అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా.. వాటిని చేస్తే ఎలాంటి సమస్యలు రావు. కాని భారీ మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తే అధికారుల నుంచి నోటీసులు అందుకోక తప్పదు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బ్యాంకు ద్వారా లావాదేవీలు చేయడం మంచిది.
ఇది కూడా చదవండి మూడు రోజుల్లోనే పీఎఫ్ డబ్బులు మీ ఖాతాల్లోకి.. EPFO కొత్త మార్పులు: ఏప్రిల్ 1, 2025 నుండి అమలు