రజనీకాంత్ సినిమా 'కూలీ' రిలీజ్ డేట్ వచ్చింది. ఊహించినట్టుగానే ఈ మూవీ ఇండిపెండెన్స్ డేని టార్గెట్ చేస్తూ రాబోతుంది. కానీ అక్కడే అసలు క్లాష్ నెలకొనబోతుంది.
Rajinikanth Movie Coolie Latest Update: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ 'కూలీ' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' లాంటి సినిమాలు తీసిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ చేస్తున్నాడు.
ఆయన ఫస్ట్ టైమ్ రజనీకాంత్ తో కలిసి పనిచేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 1 అనుకున్నారు.
'కూలీ' మూవీ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ శుక్రవారం సినిమా కొత్త పోస్టర్ షేర్ చేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. ఈ సినిమా 2025 ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని పోస్టర్ తో పాటు క్యాప్షన్ లో చెప్పారు. పోస్టర్ లో రజనీకాంత్ విజిల్ వేస్తూ కనిపించాడు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా డైరెక్ట్ గా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'వార్ 2' సినిమాతో పోటీ పడనుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా 2025 ఆగస్టు 14న రిలీజ్ కానుంది. దీంతో ఇప్పుడు రజనీ, ఎన్టీఆర్ ల మధ్య బాక్సాఫీసు వార్ తప్పేలా లేదు. ఇది రెండు సినిమాలకు కలెక్షన్ల పరంగా పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. పైగా `కూలీ`లో అమీర్ ఖాన్ ఉండటంతో అది `వార్ 2`కి ఎఫెక్ట్ కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Sound-ah yethu! 📢 Deva Varraaru🔥 worldwide from August 14th 😎 … pic.twitter.com/KU0rH8kBH7
— Sun Pictures (@sunpictures)
'కూలీ' సినిమాలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్ కూడా కనిపిస్తాడు. దాదాపు 30 ఏళ్ల తరువాత ఇద్దరు స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. దీనికి ముందు వీళ్లిద్దరూ 1995లో వచ్చిన 'ఆతంక్ హి ఆతంక్' సినిమాలో కనిపించారు.
'కూలీ' సినిమాలో నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 280 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
read more: స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్.. సిల్క్ స్మిత పారితోషికం ఎంతో తెలుసా? సమంత, రష్మిక దిగదుడుపే