IPL 2025 MI vs LSG: Why Rohit Sharma not playing against Lucknow Super Giants vs Mumbai Indians
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 16వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్ లో ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆడటం లేదు. రోహిత్ శర్మ నుంచి బిగ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న అభిమానులను ఈ విషయం తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఎందుకు ఆడటం లేదో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు.
Why Rohit Sharma not playing against Lucknow Super Giants vs Mumbai Indians
లక్నో లోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ సమయంలో రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడటం లేదని హార్దిక్ పాండ్యా చెప్పాడు. గాయం కారణంగా హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ ను ఆడటం లేదని తెలిపాడు. అయితే, రోహిత్ శర్మ గాయం ఎంత పెద్దది? ఎప్పటివరకు ముంబై టీమ్ కు అందుబాటులో ఉంటాడనే విషయం చెప్పలేదు. మోగాలి గాయంతో బాధపడుతున్న ఈ సీనియర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ లేకపోవడం ముంబై ఫ్రాంచైజీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి.
Why Rohit Sharma not playing against Lucknow Super Giants
2001 తర్వాత తొలిసారి రోహిత్ శర్మ గాయం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మకు మంచి ఆరంభం లభించలేదు. ఆడిన మూడో మ్యాచ్ లలో బిగ్ ఇన్నింగ్స్ లు ఆడలేకపోయాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 0, గుజరాత్ టైటాన్స్ పై 8, కోల్ కతా నైట్ రైడర్స్ పై 13 పరుగులు ఇన్నింగ్స్ లను ఆడాడు. అయితే, నాల్గో మ్యాచ్ లో తిరిగి బిగ్ ఇన్నింగ్స్ ట్రాక్ లోకి వస్తాడని భావించారు కానీ, గాయంతో మ్యాచ్ మొత్తానికే దూరం అయ్యాడు.
Why Rohit Sharma not playing against LSG
ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లను ఆడింది. రెండు ఓటములు, ఒక గెలుపుతో రెండు పాయింట్లు సాధించి ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. జస్ప్రీత్ బుమ్రా త్వరలో తిరిగి జట్టులోకి వస్తాడని హార్దిక్ పాండ్యా చెప్పాడు. రోహిత్ శర్మ కూడా తర్వాతి మ్యాచ్ లో కనిపించవచ్చు. కాబట్టి ఇది ముంబైకి బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
LSG vs MI: ప్లేయింగ్ 11
లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్
ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుతూర్