Peddi Movie
Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న `పెద్ది` సినిమా భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో రూపొందుతుంది. `ఉప్పెన` తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రమిది. దాదాపు మూడు నాలుగేళ్లపాటు ఆయన ఈ స్క్రిప్ట్ పైనే ఫోకస్ పెట్టాడు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.
peddi movie
ఇటీవల `పెద్ది` సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది. రా అండ్ రస్టిక్ లుక్‌లో చరణ్ కనిపిస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్ కిర్రాక్ అనిపించేలా ఉంది. మెగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంది.
జస్ట్ ఈ లుక్కే ఇలా ఉంటే, ఇక సినిమా ఎలా ఉండబోతుందనే అనేది తెలియజేస్తుంది. ఎంత అంచనాలు పెట్టుకున్నా దాన్ని మించి ఉండబోతుందని తెలుస్తుంది.
Ram Charan
ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి గ్లింప్స్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రామ్ చరణ్ బర్త్ డే రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ ఎప్పుడు అనేదాన్ని సస్పెన్స్ లో పెట్టారు.
తాజాగా గ్లింప్స్ డేట్ ఫిక్స్ చేశారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఈ టీజర్‌ని ఫస్ట్ షాట్ పేరుతో ఏప్రిల్ 6 ఉదయం 11.45 గంటలకు విడుదల చేయబోతున్నారు.
RC 16
ఫస్ట్ షాట్ విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా బుచ్చి బాబు సానా, సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తుది మిక్సింగ్ పనిని పూర్తి చేశారు. ఈ ఫస్ట్ షాట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుందని టీమ్ తెలిపింది.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `పెద్ది` చిత్రం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో అభిమానుల అంచనాల్ని పెంచేలా పెద్ది ఫస్ట్ షాట్ పవర్-ప్యాక్డ్ విజువల్ ట్రీట్ ఇస్తుందని చిత్ర బృందం వెల్లడించింది.