Silk Smitha
Silk Smitha: ఆంధ్రలో పుట్టి పెరిగిన నటి సిల్క్ స్మిత. ఈమె అసలు పేరు వడలపట్టి విజయలక్ష్మి. సినిమా ఆమెకు సిల్క్ స్మిత అనే గుర్తింపును ఇచ్చింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ
ఇలా చాలా భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించారు. కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత భర్త, అత్తగారి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చింది.
Silk Smitha
నటి అపర్ణకు టచ్ అప్ ఆర్టిస్ట్ గా తన సినిమా జీవితాన్ని ప్రారంభించిన సిల్క్ స్మితకు 'ఇనయే తేడి' అనే మలయాళ చిత్రం సినిమా అవకాశాన్ని ఇచ్చింది. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్ సిల్క్ స్మితకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అంతేకాదు ఈస్ట్‌మన్ ఆమెకు స్మిత అని పేరు పెట్టారు.
Silk Smitha
అయితే, అంతకుముందు తమిళ చిత్ర పరిశ్రమలో విను చక్రవర్తి సిల్క్ స్మితకు మంచి గుర్తింపు ఇచ్చారు. 'వండిచక్కరం' చిత్రంలో నటించడం ద్వారా ఆమెకి మంచి పేరు వచ్చింది.
అంతేకాదు ఈ చిత్రంలో సిల్క్ పాత్రలో నటించిన నేపథ్యంలో ఆ దర్శకుడు ఇచ్చిన స్మిత పేరుని యాడ్ చేసి తర్వాత సిల్క్ స్మితగా అటు ఇండస్ట్రీ, ఇటు అభిమానులు పిలుచుకున్నారు. అదే ఒక బ్రాండ్‌గా మారిపోయింది.
Silk Smitha
తొలుత వ్యాంపు రోల్స్ చేయడంతో వాటికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన రావడంతో సిల్క్ స్మితకి ఆఫర్లు పెరిగాయి. వరుసగా మేకర్స్ ఆమెని తీసుకునేందుకు క్యూ కడుతున్నారు.
ఈ క్రమంలో ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఓ వైపు హీరోయిన్‌గా మూవీస్, మరోవైపు వ్యాంపు రోల్స్, ఇంకోవైపు ఐటెమ్ సాంగ్స్ తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత.
Silk Smitha
1980, 1990 దశకాల్లో సిల్క్ స్మిత దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర తారగా వెలుగొందారు. 80వ దశకంలో కలల రాణిగా కూడా మెరిసింది. ఆమె కళ్లకు చాలామంది అభిమానులు దాసోహం అయ్యారు. అంత శక్తి ఆమె కళ్లలో ఉంది. మలయాళం, తమిళ హీరోలు తమ చిత్రాల్లో సిల్క్ స్మిత పాటలు ఉండాలని కోరుకునేవారు. తెలుగులోనూ ఆ డిమాండ్ పెరిగింది.
Silk Smitha
సిల్క్ ఒక్క ఐటమ్ డ్యాన్స్ చేయడానికి 50 వేల వరకు పారితోషికం తీసుకునేదట. ఇది ఇప్పటి కాలంలో 5 కోట్లకు సమానమని చెబుతారు. అంటే హీరోయిన్ కంటే 10-5 నిమిషాల పాటకి ఎక్కువ పారితోషికం తీసుకునేది. ఇప్పటి లెక్క ప్రకారం సమంత, రష్మికలు కూడా ఆమె ముందు నిలబడరని చెప్పొచ్చు.
సిల్క్ డ్యాన్సర్, విలన్ పాత్రల్లోనూ నటించారు. ఒక దశలో సినిమా అవకాశాలు తగ్గినప్పుడు సినిమా నిర్మాణం చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆమెకు 2 కోట్ల వరకు నష్టం వచ్చి మద్యపానానికి బానిస అయ్యారని సమాచారం.