ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ సినీ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో వేణుమాధవ్ కి చిరంజీవి, బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం.
చిరు 150వ సినిమా, బాలయ్య 100వ సినిమా సక్సెస్ అందుకోవాలని వేణుమాధవ్ గుండు కూడా కొట్టించుకున్నారంటే వారిపై ఎంత ప్రేమో అర్ధం చేసుకోవచ్చు. చిరుతో కలిసి వేణుమాధవ్ కొన్ని సినిమాలు చేశాడు. మాములుగా అయితే వేణుమాధవ్ తన పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ని పాటించడు.
పరిశ్రమకొచ్చినప్పట్నుంచీ తన పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నారు. వారికి ఉపయోగపడే ఏదొక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తినిస్తుందని గతంలో వేణుమాధవ్ చెప్పారు. అయితే ఒక్కసారి మాత్రం చిరంజీవి గారి కోసం రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చిందని వేణుమాధవ్ చెప్పారు.
చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' సినిమాలో నటిస్తోన్న సమయంలో వేణుమాధవ్ పుట్టినరోజు వచ్చిందట. ఆ విషయం చిరంజీవికి తెలిసి వెంటనే కేక్ తెప్పించి వేణుమాధవ్ తో కట్ చేయించారట. ఆ సమయంలో కేక్‌ను కట్ చేయక తప్పలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వేణుమాధవ్.
related news
వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!
వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!
మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!
'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!
బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!
బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!
బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!
ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!
కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!
వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క
అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు
వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?
వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?
వేణుమాధవ్ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్
టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్
వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...
వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..