'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

By tirumala ANFirst Published Sep 25, 2019, 3:00 PM IST
Highlights

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణు మాధవ్ ని నిన్న కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణు మాధవ్ ని నిన్న కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ చేసిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికే విషమించడంతో ఆయన మరణించారు. వేణు మాధవ్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోకంలో మునిగిపోయింది. 

మొదట పోటుగాడిలా బిల్డప్ లు ఇవ్వడం.. ఆ తర్వాత కథ అడ్డం తిరగడం లాంటి పాత్రలతో వేణు మాధవ్ బాగా పాపులర్ అయ్యారు. వేణుమాధవ్ మృతితో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వేణుమాధవ్ కెరీర్ లో దిల్, సై, సింహాద్రి, వెంకీ, లక్ష్మి తొలి ప్రేమ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో  నటించారు. 

హీరో నితిన్ వేణుమాధవ్ మృతికి సంతాపం తెలియజేశాడు. ఇది చాలా విషాదకరమైన వార్త. టాలీవుడ్ అద్భుతమైన కమెడియన్లలో వేణు మాధవ్ ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నితిన్ తో కలసి దిల్, సై లాంటి చిత్రాల్లో వేణుమాధవ్ నటించారు. దిల్ చిత్రంలో కాలేజీ సీటు కోసం ఎమ్మెస్ నారాయణకు వేణుమాధవ్ సమాధానాలు చెప్పే సన్నివేశం చాలా బావుంటుంది. తండ్రి పేరు అడిగితే అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్ అతనూ వేణుమాధవ్ ఇంటర్వ్యూలో చెప్పే సమాధానాలు చాలా ఫన్నీగా ఉంటాయి. 

Sad to hear about the sudden demise of one of the finest comedians of Telugu cinema, garu. May his soul rest in peace 🙏🏻

— nithiin (@actor_nithiin)

 

వేముమాధవ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. తెలుగు సినిమాకు వేణుమాధవ్ ఎన్నో సేవలు అందించారు. ఆయనకు కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. 

garu.
Thank you for your contribution to telugu cinema.
Condolences to his family and friends.

— Gaddalakonda Ganesh 😈 (@IAmVarunTej)

చాలా విషాదకరం.. వేణుమాధవ్ అద్భుతమైన నటుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని నటుడు బ్రహ్మాజి సంతాపం తెలిపారు. 

Sad.. unfortunate..what an actor he was.. Rest in peace my dear.. 🙏🏼

— BRAHMAJI (@actorbrahmaji)

చిత్ర పరిశ్రమలో వేణుమాధవ్ గారు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన ఇకలేరనే వార్త నన్ను చాలా బాధించింది. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా అని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

Extremely saddened that garu is no more. He has created a mark for himself with his fabulous work over decades. Condolences to his family and friends.

— Revanth Reddy (@revanth_anumula)

గోకులంలో సీత చిత్రం నుంచి నాతో కలసి పలు చిత్రాల్లో వేణుమాధవ్ నటించారు. అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉంది. వేణుమాధవ్ మృతికి ఆయన కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..

 

click me!