చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

By Udayavani DhuliFirst Published Dec 27, 2018, 9:22 PM IST
Highlights

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాప్రీరిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా టైటిల్ నాకు బాగా నచ్చింది. 'వినయ విధేయ రామ'.. రాముడు 
మర్యాద పురుషోత్తముడు..

ఎంత వినయంగా, విధేయతో ఉంటాడో.. శత్రువు దగ్గర అంత భయంకరంగా ఉంటాడు. అది టైటిల్ లో కనిపించట్లేదు.. కానీ టీజర్ లో కనిపించింది. బోయపాటి గారు కమర్షియల్ సినిమాలను చాలా ఎగ్జైటింగ్ గా చూపించగలరు. రాముడు గురించి శతాబ్దాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం.. అలాంటి హీరో రామ్ చరణ్. చిరంజీవి  గారు ఎలాంటి రూట్ వేశారంటే.. ఆయన కుటుంబం తెలుగువారి కుటుంబం అయిపోయింది.

ఆయన తమ్ముడు మనందరికీ ఇంట్లో మనిషి అయిపోయాడు. వాళ్ల అబ్బాయి మన ఇంట్లో పిల్లాడు అయిపోయాడు. చిరంజీవి గారు అలాంటి దుర్గం కట్టారు. చిరంజీవి గారి గురించి మాట్లాడకుండా సౌత్ ఇండియా సినిమా గురించి మాట్లాడలేం. ఆయన సినిమాల కోసం క్యూలో నిలబడి చెమటలతో చొక్కాలు చిరిగిపోయిన రోజులు గుర్తున్నాయి. అంత ఇబ్బందితో సినిమా థియేటర్ లోకి వెళ్లినా మనల్ని ఆనందపరిచే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే..

ఆయన్ని స్పూర్తిగా తీసుకొని నేను సినిమాల్లోకి వచ్చాను. మెగాస్టార్ వాళ్ల తమ్ముడు మనందరికీ ఆత్మీయుడు.. ఆయన మాటల్లో చెప్పాలంటే అంతా కలిపితే నేను.. పిడికెడు మట్టే కావొచ్చు.. కానీ ఒక్కసారి నేను తలెత్తి చూసానంటే.. ఓ దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉందంటాడు.. అలాంటి పవన్ కళ్యాణ్ కి కొడుకైన రామ్ చరణ్.. నేను తప్పుడు వరస చెప్పడం లేదు.. కళ్యాణ్ గారు నాతో స్వయంగా అన్నారు.. రామ్ చరణ్ నా కొడుకు అంటూ గర్వంగా చెప్పారు.

అటువంటి రామ్ చరణ్ కి ఈ సినిమా మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన నటించిన 'రంగస్థలం' సినిమా.. సినిమాలు తీసేవారి ఆలోచనలు మార్చేసింది. రామ్ చరణ్ ని చూస్తుంటే నాకొక విషయం గుర్తొస్తుంది.. అదేంటంటే సింహం దాదాపు 10,12 రోజులకు గాని వేటాడదు. ఎందుకంటే మిగతా జంతువుల మాదిరి కాదు.. బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడి తింటుంది. అది తినగా వదిలేసిన దాన్ని మిగిలిన జంతువులు నెలరోజులు పాటు తిని పండగ చేసుకుంటాయి. చరణ్ కూడా అంతే.. సింహం లాంటివాడు'' అంటూ చెప్పుకొచ్చారు. 

ఇవి కూడా చదవండి..

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!

click me!