
హైదరాబాద్: తెలుగు సినీ హీరో మహేష్ బాబుకు జీఎస్టీ షాక్ తగిలింది. ఆయన ఖాతాలను హైదరాబాద్ జీఎస్టీ కమిషనర్ ఫ్రీజ్ చేశారు. మహేష్ బాబు వివిధ ప్రకటనలు, ప్రమోషన్, బ్రాండ్ అంబాసిడర్‌గా అందించిన సేవలకు గాను మహేష్‌కు లభించిన ఆదాయంపై పన్ను చెల్లించలేదని జీఎస్‌టీ ఆరోపించింది. సత్వరమే ఈ పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది.
గత తొమ్మిదేళ్లుగా పన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు ఆయన బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జీఎస్‌టీ కమిషనరేట్ ఒక ప్రకటన జారీ చేసింది. 2007-08 సంవత్పరానికి గాను సర్వీస్ టాక్స్ చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది.
ఈ కాలానికి మొత్తం 18.5 లక్షల రూపాయలు బకాయి ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మహేష్‌కు చెందిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్‌లను సీజ్ చేసింది. పన్ను, జరిమానా, వడ్డీతోసహా మొత్తం 73.5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.