సర్కార్ లేడీ విలన్ తో జయలలితకు పోలిక: కొట్టిపారేసిన దినకరన్

By pratap reddyFirst Published Nov 9, 2018, 3:16 PM IST
Highlights

వరలక్ష్మి పాత్ర కట్టుబొట్టు కూడా జయలలిత కట్టుబొట్టును పోలి ఉన్నాయని అన్నాడియంకె విమర్శలు చేస్తోంది. జయలలిత ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై సినిమాలో పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. ఆ సన్నివేశాలను తొలగించాలని అన్నాడియంకె పట్టుబడుతోంది. 

చెన్నై: సర్కార్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు దివగంత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ముడిపెడుతూ అన్నాడియంకె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వరలక్ష్మి పాత్ర జయలలితను పోలి ఉందనే కారణాన్ని చూపిస్తున్నారు.  జయలలిత అసలు పేరు కోమలవల్లి అని, వరలక్ష్మి పోషించిన లేడీ విలన్ కు ఆ పేరే పెట్టారని అంటున్నారు.

వరలక్ష్మి పాత్ర కట్టుబొట్టు కూడా జయలలిత కట్టుబొట్టును పోలి ఉన్నాయని అన్నాడియంకె విమర్శలు చేస్తోంది. జయలలిత ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై సినిమాలో పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. ఆ సన్నివేశాలను తొలగించాలని అన్నాడియంకె పట్టుబడుతోంది.  ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పథకాల పోస్టర్లను చింపినట్లు సినిమాలో చూపించారని రాష్ట్ర మంత్రి సివి షణ్ముగం అన్నారు. ఆ సన్నివేశాలను తొలగించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని తమంత్రి కాదంబూర్, సి. రాజు హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో ఆర్కె నగర్ ఎమ్మెల్యే టీటీవి దినకరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి కాదని, 2003లో అలా ప్రచారం జరిగిందని అన్నారు.

కాంగ్రెసు పార్టీకి చెందిన ఓ నేత 2003లో జయలలితను ఉద్దేశించి కోరమరవల్లి అంటూ విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు జయలలిత తనతో మాట్లాడారని, తాను కోరమరవల్లి అనే పాత్రలో నటించలేదని చెప్పారని ఆయన అన్నారు. ఆ నేత ఆ పేరుతో ఎందుకు పిలిచారో తెలియదని కూడా జయలలిత అన్నట్లు తెలిపారు. 

సర్కార్ సినిమా చూడకుండానే అన్నాడియంకె నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. అవగాహన లేకుండా వారు మాట్లాడుతున్నారని తప్పు పట్టారు. జయలలితను కించపరిచే సన్నివేశాలు అందులో లేవని అన్నారు.  

సర్కార్ సినిమాలో విజయ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మురగదాస్ దర్శకత్వం వహించారు. అన్నాడియంకె నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సీన్లను తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సీన్లను తొలగించడానికి అంగీకరించారని అంటూ మంత్రి ఆర్.బి. ఉదయ కుమార్ ఫిల్మ్ మేకర్స్ కు థ్యాంక్స్ కూడా చెప్పారు 

సంబంధిత వార్తలు

'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?

'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

click me!