ఆత్మహత్యకు ముందు ఓ వ్యక్తితో 20 నిమిషాలు కోడెల ఫోన్

Published : Sep 17, 2019, 10:35 AM ISTUpdated : Sep 17, 2019, 10:38 AM IST
ఆత్మహత్యకు ముందు ఓ వ్యక్తితో 20 నిమిషాలు కోడెల ఫోన్

సారాంశం

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్: ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య  చేసుకోవడానికి ముందు  ఓ వ్యక్తితో సుమారు 20 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎవరితో కోడెల ఫోన్‌లో మాట్లాడారు. ఏం మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్‌లోని తన నివాసంలో కోడెల శివప్రసాదరావు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం నాడు ఉదయం కోడెల శివప్రసాదరావు 8:30 గంటలకు ఫోన్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఫోన్ లో కోడెల ఎవరితో మాట్లాడారనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తితో కోడెల శివప్రసాదరావు 20 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు.

కోడెల శివప్రసాదరావు ఫోన్ ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ పోన్ కాల్స్ తో పాటు ఎస్ఎంఎస్ వివరాలను పరిశీలిస్తున్నట్టు  ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి  ఒకరు చెప్పారు.

కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తన భార్యతో కలిసి టిఫిన్‌ చేశారు. 10.10 గంటల సమయంలో మొదటి అంతస్తులో ఉన్న తన గదికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో కోడెల భార్య, కుమార్తె ఉన్నారు. 

ఉదయం పదిన్నర గంటల సమయంలో  కోడెల శివప్రసాదరావుకు కొబ్బరి నీళ్లు ఇచ్చేందుకు డ్రైవర్ ఆయన గదికి వెళ్లారు. ఆ సమయంలో  ఆయన తలుపు తీయలేదు. దీంతో ఆయన కోడెల కూతురును పిలిచారు. 

ఆమె కూడ పిలిచినా కోడెల శివప్రసాదరావు తలుపులు తీయలేదు. కిటీకీలోంచి చూస్తే ఆయన ఫ్యాన్ కు ఉరేసుకొన్నట్టు గుర్తించారు. వెనుక డోర్ నుండి ప్రవేశించి కుటుంబసభ్యులు ఆయనను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

మంచి కుక్కని పిచ్చికుక్క అని ప్రచారం చేసి... కోడెల మృతిపై చంద్రబాబు

కోడెల శివప్రసాద్ సూసైడ్: మెడ బాగంలో తాడు మరకలు

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

కోడెల సూసైడ్: గది సీజ్ చేసిన పోలీసులు

కోడెల మృతి: ఆయన కుమారుడిపై మేనల్లుడి సంచలన ఆరోపణలు

కోడెల మృతిపై ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్..

కోడెలను సీఎం జగన్ హత్య చేశారు.. కేశినేని ట్వీట్

నాన్న తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

కోడెల మృతి... పోస్టుమార్టం తర్వాతే చెబుతామంటున్న డీసీపీ

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

PREV
click me!

Recommended Stories

Perni Nani press meet: మోయ‌లేని గుదిబండగా అమ‌రావ‌తి చంద్రబాబుపై పేర్నినాని సెటైర్లు | Asianet Telugu
Raghurama KrishnamRaju: మావాళ్లని మోసం చేయొద్దు | Update on Akividu Ramalayam | Asianet News Telugu