నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో బీజేపీ మొదటి నుండి లీడ్ లో ఉంది. లీడ్ కొనసాగిస్తూ బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ విజయం సాధించారు.
Kothagudem Assembly Election Results 2023 LIVE: కొత్తగూడెం కీలక నియోజకవర్గాల్లో ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి కూనంనేని సాంబశివరావు లీడ్ లో ఉన్నారు.
ఆంథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ పై దామోదర రాజనర్సింహ విజయం సాధించారు.
నిర్మల్ జిల్లా ఖానా పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ పార్టీకి చెందిన వెడ్మ బొజ్జు విజయం సాధించాడు.
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పట్లోల్ల సంజీవరెడ్డి విజయం సాధించారు.
Rajasthan Election Results 2023: రాజస్థాన్ లో బీజేపీ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ 110 స్థానాల్లో, కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 19 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు.
చెన్నూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వా విజయం సాధించారు. బాల్క సుమన్‌పై ఆయన ఘన విజయం సాధించారు.
Assembly Election Results: ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ దూసుకుపోతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీగా లీడ్ లో ముందుకు సాగుతున్నాయి.
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. గతంలో కోదాడ అసెంబ్లీలో ఈ నియోజకవర్గం ఉంది. 2009 నుండి 2018 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2019 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు.
ఇటీవల మూడు రాష్ట్రాల్లో శాసన సభా స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు లెక్కించనున్నారు. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు బందోబస్తు నడుమ ఈ ఫలితాల కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు దాదాపు మధ్యాహ్నం వరకు పూర్థి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.