Asianet News TeluguAsianet News Telugu

Huzurnagar assembly results 2023: హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..ఉత్తమ్ గెలుపు

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది.  గతంలో కోదాడ అసెంబ్లీలో ఈ నియోజకవర్గం ఉంది.  2009 నుండి  2018 వరకు  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.  2019 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు. 

 Huzurnagar assembly results 2023: Updates and Highlights: Counting of Votes On lns
Author
First Published Dec 3, 2023, 10:39 AM IST

హైదరాబాద్:హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో  కాంగ్రెస్ అభ్యర్థి  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 44,889 ఓట్ల మెజారిటీతో  బీఆర్ఎస్ అభ్యర్ధిపై  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

2009 నియోజకవర్గాల పునర్విభజన సమయంలో  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఏర్పడింది.  అంతకుముందు కోదాడలో  భాగంగా  ఈ నియోజకవర్గం ఉండేది.హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానం  నెంబర్  89. సూర్యాపేట జిల్లాలో  ఈ అసెంబ్లీ స్థానం ఉంది.నల్గొండ లోక్‌సభ పార్లమెంట్ పరిధిలో  హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఉంది.

also read:Achampet Election Result 2023: అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు

హూజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో  16.82 శాతం  ఎస్‌సీ జనాభా ఉంది.  ఎస్‌టీ జనాభా  13.11 జనాభా ఉంది.  సూర్యాపేట జిల్లాలో  64.11 శాతం అక్షరాస్యత ఉంది. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో  2,42,711 మంది ఓటర్లున్నారు.  వీరిలో 1,18, 664 పురుష ఓటర్లున్నారు.  1,24,030 మంది మహిళా ఓటర్లున్నారు.  17 మంది ట్రాన్స్ జెండర్లున్నారు.

also read:Telangana Assembly Election Results 2023 LIVE : కేసీఆర్ తో సహా ఆరుగురు మంత్రులు వెనుకంజ...

2018 ఎన్నికల్లో  2,23,686 మంది ఓటర్లున్నారు. 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఈ స్థానం నుండి విజయం సాధించారు.  బీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డిపై 7,466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి  47.82 శాతం ఓట్లు దక్కాయి. 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి  ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో  హుజూర్ నగర్ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దరిమిలా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి 2019లో  ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ సతీమణి పద్మావతి రెడ్డి  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా  శానంపూడి సైదిరెడ్డి  పోటీ చేశారు.  ఈ ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి  గెలుపొందారు.  సైదిరెడ్డి 43,358 ఓట్ల మెజారిటీతో  పద్మావతి రెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి  ఉత్తమ్ కుమారెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగారు.  బీఆర్ఎస్ అభ్యర్థిగా  శానంపూడి సైదిరెడ్డి  పోటీ చేస్తున్నారు. సీపీఐఎం నుండి మల్లు లక్ష్మీ బరిలో నిలిచారు.  

 


 

Follow Us:
Download App:
  • android
  • ios