నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో బీజేపీ మొదటి నుండి లీడ్ లో ఉంది. లీడ్ కొనసాగిస్తూ బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ విజయం సాధించారు. 

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ లీడ్ లో కొనసాగారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జి విఠల్‌రెడ్డి వెనుకబడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రభావం చూపించలేకపోయారు. ఇందులో బీజేపీకి 50457 ఓట్లు నమోదయ్యాయి. బీఆర్ఎస్‌కి 40116 ఓట్లు, కాంగ్రెస్‌కి 9774ఓట్లు నమోదయ్యాయి. 12వ రౌండ్లకి గానూ ఈ రిజల్ట్ వచ్చింది. ఇందులో 10341ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రామారావు దూసుకుపోయారు. చివరి రౌండ్ ముగిసే నాటికి బీఆర్ఎస్ అభ్యర్థిపై 23999 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. .

Read more: తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్‌