ఆంథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చంటి  క్రాంతి కిరణ్ పై  దామోదర రాజనర్సింహ విజయం సాధించారు. 

హైదరాబాద్: ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ విజయం సాధించారు. ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ 36.జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆందోల్ అసెంబ్లీ స్థానం ఉంది.ఆందోల్ అసెంబ్లీ స్థానంలో 22.08 శాతం ఎస్‌సీ జనాభా ఉంది. 4.6 శాతం ఎస్టీ జనాభా ఉంది.64.08 శాతం ఆందోల్ నియోజకవర్గంలో అక్షరాస్యత ఉంది. ఈ ఎన్నికల్లో 2,44,710 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,20, 572 మంది పురుష ఓటర్లు, 1,24,133 మంది మహిళా ఓటర్లున్నారు. ఐదుగురు ట్రాన్స్ జెండర్లు ఈ నియోజకవర్గంలో నమోదయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:Telangana Assembly Election Results 2023 LIVE : గాందీ భనన్ కు రేవంత్ విజయోత్సవ ర్యాలీ...


2018 ఎన్నికల్లో 2,21,931 మంది ఓటర్లున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి క్రాంతికిరణ్ విజయం సాధించారు. దామోదర రాజనర్సింహపై 16,465 ఓట్ల మెజారిటీతో క్రాంతి కిరణ్ విజయం సాధించారు. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ బరిలోకి దిగారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.

also read:Telangana Election results 2023: రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్, అభినందనలు తెలిపిన ఐపీఎస్ అధికారులు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 30న పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని భారత రాష్ట్ర సమితి అస్త్రశస్త్రాలను సంధించింది. కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో తెలంగాణలో పట్టు సాధించాలని బీజేపీ నాయకత్వం అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీలు కలిసి పోటీ చేశాయి. బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది.