Asianet News TeluguAsianet News Telugu

Narayankhed Assembly Election Results 2023: నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోల్ల సంజీవ రెడ్డి విజయం 

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పట్లోల్ల సంజీవరెడ్డి విజయం సాధించారు. 
 

narayankhed assembly election result 2023 congress candidate patlolla sanjeeva reddy leading ksr
Author
First Published Dec 3, 2023, 12:53 PM IST

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరపున ఎం భూపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా జనవాడే సంగప్ప పోటీ చేశారు. వీరిద్దరిపై సంజీవ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఫైనల్ రౌండ్ కౌంటింగ్ ముగిసేనాటికి 6547 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

మొత్తంగా కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అధికార బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ 8 స్థానాల్లో గెలుపొంది ప్రభావం చూపింది. జనసేన ఘోర ఓటమి మూటగట్టుకుంది. కూకట్ పల్లి మినహాయిస్తే 7 చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది. ఎమ్ఐఎమ్ తన 7 నియోజకవర్గాలు కాపాడుకుంది. 

ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios