Asianet News TeluguAsianet News Telugu

Mysuru Gangrape Case : వాంగ్మూలం ఇవ్వకుండా.. కుటుంబంతో సహా ఊరొదిలి వెళ్లిపోయిన బాధితురాలు.. !

బాధితురాలు తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి ఇష్టపడలేదు. దీంతో కేసు బలహీనపడే అవకాశం ఉందని ఫోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మానసికంగా షాక్ లో ఉండడం వల్ల ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయలేకపోయామని కర్ణాటక ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 

Mysuru Gangrape Case : Survivor's family left the city without giving statement to police
Author
Hyderabad, First Published Aug 30, 2021, 9:20 AM IST

మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలు పోలీసులకు తన వాంగ్మూలం ఇవ్వకుండానే, కుటుంబంతో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయింది. గత మంగళ వారం ఛాముండి హిల్స్ లో 23యేళ్ల ఓ యూనివర్సిటీ స్టూడెంట్‌పై దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 

 ఒక న్యూస్ ఛానెల్‌లోని నివేదిక ప్రకారం, బాధితురాలు తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి ఇష్టపడలేదు. దీంతో కేసు బలహీనపడే అవకాశం ఉందని ఫోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మానసికంగా షాక్ లో ఉండడం వల్ల ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయలేకపోయామని కర్ణాటక ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 

కాగా, కర్ణాటకలోని మైసూరులో గత మంగళవారం సాయంత్రం ఓ యూనివర్సిటీ స్టూడెంట్‌పై దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ను చితకబాదారు. అనంతరం పరారయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మైసూరులోని యూనివర్సిటీ విద్యార్థిని, ఆమె మిత్రుడితో కలిసి నగర శివారులోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం చాముండి హిల్స్‌కు వెళ్లారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు వారిని చుట్టుముట్టారు. ముందు డబ్బులు ఇవ్వమని బెదిరించినట్టు తెలిసింది. కానీ, అందుకు వారు తిరస్కరించారు. దీంతో గ్యాంగ్‌లోని ఇద్దరు యువతిని రేప్ చేసినట్టు సమాచారం. మిగతా దుండగులు యువకుడిని చావబాదినట్టు తెలిసింది.

బాధితురాలు రాత్రి 1.30గంటల ప్రాంతంలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. పోలీసులు సెక్షన్ 376-డీ కింద గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు.

కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఘటనపై స్పందిస్తూ ఎఫ్ఐఆర్ నమోదైందని వివరించారు. అధికారులు ఇప్పటికే మైసూరు చేరుకున్నారని, తానూ రేపు అక్కడికి వెళ్తున్నట్టు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు మంగళవారం రాత్రి 7.30 గంటలకు చాముండి హిల్స్ సమీపంలోని హెలిప్యాడ్ దగ్గరి అటవీ ప్రాంతాన్ని సందర్శించారని, అదే సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు.

ఇదిలా ఉండగా... ఘటన జరిగిన రెండు రోజుల్లోనే మైసూరు గ్యాంగ్ రేప్ కేసును కర్ణాటక పోలీసులు ఎట్టకేలకు క్రాక్ చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్టు సమాచారం.

మైసూరు శివారుల్లోని చాముండి హిల్స్ దగ్గర యూనివర్సిటీ విద్యార్థినిపై మంగళవారం రాత్రి గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌ను చితకబాదిన దుండగులు 23ఏళ్ల ఎంబీఏ స్టూడెంట్‌పై లైంగికదాడికి పాల్పడ్డారు. ఇన్నాళ్లు ఆమె అపస్మారక స్థితిలోనే ఉండటంతో పోలీసులు వాంగ్మూలం తీసుకోవడం వీలుపడలేదు. ఫలితంగా నిందతులను గుర్తించడం కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హోం శాఖపై విమర్శలు వచ్చాయి. లైంగికదాడి జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి.

అరెస్టు చేసిన ఐదుగురు నిందితులు తమిళనాడు తిరుప్పూర్ జిల్లా నుంచి వచ్చిన వలస కార్మికులని పోలీసులు తెలిపారు. ఇందులో ఒకరు మైనర్ అని అనుమానిస్తున్నారు. ఓ నిందితుడికి 17ఏళ్లే ఉన్నట్టు డీజీపీ ప్రవీణ్ సూద్ చెప్పారు. కానీ, దీన్ని పరిశీలించాల్సి ఉన్నదని వివరించారు. ఇది సెన్సిటివ్ కేసు అని, తమ దగ్గర టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

యూనివర్సిటీ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్.. బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాదిన దుండగులు

మైసూరు రేప్ కేసులో బాధితురాలి మిత్రుడి స్టేట్‌మెంట్‌‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం రికార్డ్ చేసింది. ఈ వాంగ్మూలంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఆ ప్రాంతం తనకు చాలా కాలం నుంచి తెలుసు అని, ప్రతి రోజు అక్కడికి జాగింగ్‌కు వెళ్లేవాడని తెలిపారు. మైసూరు శివారులోని చాముండి హిల్స్ దగ్గర ఎంబీయే విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. దీంతో బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు ఇంకా తీసుకోవాల్సి ఉన్నది.

‘క్లాస్‌లు అయిపోగానే రాత్రి 7.30 గంటలకు మేం బైక్‌పై వెళ్లాం. జేఎస్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజీ రోడ్డు మీదుగా వెళ్లాం. ఆ స్పాట్‌ నాకు చాలా కాలంగా తెలుసు. అక్కడే బండి ఆపి సరదాగా నడక ప్రారంభించాం. అప్పుడు ఉన్నట్టుండి ఆరుగురు దుండగులు మమ్మల్ని రౌండప్ చేశారు’ అని బాధితురాలి మిత్రుడు పోలీసులకు వివరించారు.

వారందరూ తనను కర్రలతో కొట్టినట్టు బాధితురాలి ఫ్రెండ్ తెలిపారు. గ్యాంగులో నుంచి ఒక సన్నని కుర్రాడు ఓ చిన్న బండరాయి తెచ్చి తన ముఖంపై కొట్టాడన్నారు. తాను స్పృహ కోల్పోయేవరకూ బాదారని వివరించారు. ‘నేను స్పృహలోకి రాగానే నా చుట్టూ నలుగురు గుమిగూడి ఉన్నారు. నా గర్ల్‌ఫ్రెండ్ ఏదని వారిని అడిగాను. అందులో ఇద్దరు పొదల్లో నుంచి నా గర్ల్‌ఫ్రెండ్‌ను లాక్కొచ్చి నా పక్కన పడేశారు. ఆమె దేహం మొత్తం గాయాలతో నిండింది. ఆమె బహుశా అపస్మారక స్థితిలో ఉన్నది’ అని వివరించారు.

ఆ రేపిస్టులు తన మొబైల్ ఫోన్ లాక్కున్నట్టు బాధితురాలి మిత్రుడు వివరించారు. ఆ ఫోన్ ద్వారా తన తండ్రికి ఫోన్ చేసి రూ. 3 లక్షలు తక్షణమే అరేంజ్ చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. వారిద్దరినీ వదిలిపెట్టడానికి ముందు రేపిస్టులకు ఆ డబ్బు ముట్టిందా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. నిందితులందరూ 25ఏళ్ల నుంచి 30ఏళ్లలోపు వారేనని తెలిసింది. 

ఇప్పటికే ఈ కేసులో తమిళనాడుకు చెందిన ఒక యువకుడితో సహా ఐదుగురిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు శనివారం ప్రకటించారు. ఆరవ నిందితుడికోసం గాలిస్తున్నట్టుగా తెలిపారు. అంతేకాదు నేర స్థలాన్ని పరిశీలించినప్పుడు, తమిళనాడులోని తల్వాడి నుండి కర్ణాటకలోని చామరాజనగర్ వరకు బస్సు టిక్కెట్లపై పోలీసులకు దొరికాయి. అలాగే సంఘటన స్థలంలో దొరికిన కొన్ని మద్యం సీసాలు తమిళనాడు ఎక్సైజ్ శాఖ ముద్ర ఉంది. ఇదిలా ఉండగా, కోర్టు నిందితుడికి 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios