Warangal Rape Case : అత్యాచారం కేసులో వరంగల్ కార్పొరేటర్ భర్త అరెస్ట్..

గత నెల 23న కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టి కార్పొరేటర్ మీద అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న శిరీష్ ను గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. 

warangal corporator husband arrested in rape case

అత్యాచారం కేసు(Rape Case)లో వరంగల్ కు చెందిన ఓ కార్పొరేటర్ భర్త(corporator husband)ను పోలీసులు అరెస్ట్ (arrest)చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేటర్ భర్త శిరీష్ తనను పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గత నెల 23న కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టి కార్పొరేటర్ మీద అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు.. పరారీలో ఉన్న శిరీష్ ను గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని పరకాల జైలుకు తరలించారు. 

కాగా, ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వంచించడమే కాకుండా భూమిపై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి.. అంటూ రూ. 90 లక్షలు వసూలు చేసిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఓ కార్పొరేటర్ భర్త కేసు పోలీసులకు సవాల్ గా మారింది. సీపీ తరుణ్‌ జోషి ఆదేశాల మేరకు పోలీసులు మిల్స్ కాలనీ పోలీసులు మూడు రోజుల కిందట కేసు నమోదు చేసిన  పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు.

దీంతోపాటు పోలీసులపై పలు ఆరోపణలు వచ్చాయి,  నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.  ఉమ్మడి జిల్లాకు చెందిన రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్న ఈ కేసులో ముందుకే వెళ్లారు.  ఈ క్రమంలో కార్పొరేటర్ భర్త అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కు ప్రయత్నించాడు.

Disha accused encounter: సిర్పూర్కర్ కమిషన్‌కి డ్రైవర్ వింత సమాధానాలు

మూడు దశాబ్దాలుగా గ్రేటర్ వరంగల్ లో ముద్రపడిన కార్పొరేటర్ భర్త తండ్రి తన వ్యాపార విస్తరణకు ఎందరో ముఖ్య నేతలకు దగ్గరయ్యాడు. బిజినెస్ సాఫీగా సాగేందుకు కొందరు పోలీసులతో సన్నిహితంగా ఉండడమే కాకుండా..  వారికి  మగువ మద్యం చూపి లోబరుచుకునే పనులు చేయించుకునే వాడని  సామాజిక మాధ్యమాలు టీవీలో వార్తలు ప్రచారం కావడంతో ఈ కేసు పోలీసు అధికారులకు తలనొప్పిగా మారింది. 

ఏకంగా కొందరు పోలీసులను  శ్రీలంక, మలేషియాకు  తీసుకెళ్లి విందువినోదాలు ఇచ్చాడని వచ్చిన వదంతులను  తీవ్రంగా పరిగణించిన సిపి  ఈ మేరకు విచారణ చేపట్టి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఈ కార్పొరేటర్ భర్త , అతడి తండ్రి  ఓ ముఖ్య నేత వ్యాపారంలో భాగస్వామి కావడంతో ఈ కేసు ఎటు వైపు మలుపులు తిరుగుతుందో అని ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పటికే సదరు నేత  సీరియస్ అవ్వడం తోనే  మిల్క్ కాలనీ  సి ఐ శ్రీనివాస్ ఒక రోజు మొత్తం పోలీసు వర్గాల్లో చర్చ జరిగింది.  సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆ సీఐ విధులకు వచ్చారు. కార్పొరేటర్ భర్తపై మోసం, అత్యాచారం, నమ్మక ద్రోహం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు ఇతడికి సహకరించిన తండ్రిపై కూడా బెదిరింపుల కేసు పెట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios