Asianet News TeluguAsianet News Telugu

Disha case: దిశ హత్యాచారంపై షార్ట్ ఫిల్మ్.... యూట్యూబ్ లో ట్రెండింగ్

ముఖ్యంగా ఎన్ కౌంటర్... అత్యాచారాలకు సరైన పరిష్కారం కాదు అనే థీమ్ తో వీరంతా షార్ట్ ఫిల్మ్స్ తీయడం గమనార్హం. నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. వీరు ఈ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. నిజ జీవితంలోనూ దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. 

Short films on Disha case trend on YouTube
Author
Hyderabad, First Published Dec 17, 2019, 11:36 AM IST

దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కదిలించింది. షాద్ నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు యువకులు అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా ఆమె నోట్లో మద్యం పోసి మరీ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చటాన్ పల్లి బ్రిడ్జ్ వద్ద సజీవదహనం చేశారు. అయితే... ఈ ఘటనలో దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ సంఘటన మొత్తం మనకు తెలిసిందే. అయితే... ఇప్పుడు ఈ సంఘటనను బేస్ చేసుకొని పలువురు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండటం గమనార్హం. ఆ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుండటం విశేషం.

ఇప్పటి వరకు దీనిని బేస్ చేసుకొని చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీశారు. కొందరు 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో తీయగా.. కొందరు మాత్రం దాదాపు 45 నిమిషాల నిడివితో తీయడం విశేషం. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో వీటిని తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఒకే సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ తెరకెక్కించడం గమనార్హం.

ముఖ్యంగా ఎన్ కౌంటర్... అత్యాచారాలకు సరైన పరిష్కారం కాదు అనే థీమ్ తో వీరంతా షార్ట్ ఫిల్మ్స్ తీయడం గమనార్హం. నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. వీరు ఈ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. నిజ జీవితంలోనూ దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. వీళ్ల దృష్టిలో అత్యాచారం చేయం కరెక్ట్ అని కాదు.. కాకపోతే... శిక్షగా ఎన్ కౌంటర్ చేయకుండా ఉండాల్సిందని.. శిక్షలు వేయడానికి కోర్టులు ఉన్నాయి కదా అని వారి ఉద్దేశం.

కాగా.... ఇప్పుడు వీరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ కి క్రేజ్ మాములుగా రాలేదు. వేలల్లో వీటికి వ్యూస్ వస్తుండటం విశేషం. దీంతో.. ఈ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, నటి గాయత్రి గుప్త స్పందించారు. 

‘‘ ఎన్ కౌంటర్ చేయడం ఇలాంటి ఘటనలకు పరిష్కారం కాదు. వెంటనే న్యాయం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఎప్పటికీ అది పరిష్కారం అవ్వదు. సమాజంలో మార్పు తేవడానికి, ఇలాంటి ఘటనలు జరిగే పరిస్థితులు లేకుండా చేయాలి. పోర్న్ సినిమాలు చూసి కూడా ప్రజలు చెడిపోతున్నారు. వాటిల్లో పురుషులకు బలం ఎక్కువగా ఉంటుందని.. స్త్రీలకు తక్కువగా ఉంటుందని చూపిస్తారు. వాటిని చూసి బయట ప్రజలు అదేనిజమని భావిస్తున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఒక షార్ట్ ఫిల్మ్ లో.... ఓ బాలికను నలుగురు యువకులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సదరు బాలికను చుట్టుముట్టేస్తారు. అప్పుడు ఆ బాలిక తన ఫోన్ లోని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఫోటో తీసి చూపిస్తుంది. అంతే ఆ యువకులు అక్కడి నుంచి పారిపోతారు. సీపీ సజ్జనార్ కి అంకితమిస్తూ... కొందరు ఈషార్ట్ ఫిల్మ్ తీశారు.

మరో షార్ట్ ఫిల్మ్ లో... ఓ యువతి స్కూటీ పంచర్ అయ్యి... చీకట్లో సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెను చూసిన నలుగురు యవకులు ఆమెపై అఘాయిత్యం చేయాలని ప్రయత్నిస్తారు. ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేస్తారు. సరిగ్గా అప్పుడే.. వాళ్లల్లో ఓ యువకుడికి ఫోన్ వస్తుంది. అతని చెల్లెలు మాట్లాడుతుంది. తన స్కూటీ పంచర్ అయ్యిందని... సహాయం చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు రా అన్నయ్య అని చెబుతుంది. తన ఎదురుగా ఉన్న అమ్మాయి కూడా ఎవరికో ఒకరికి చెల్లే కదా...అని రియలైజ్ అయ్యి.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలాంటి పలు రకాల కాన్సెప్ట్ తో తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios