గాజులు చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. ట్రెడిషనల్ వేర్, వెస్ట్రన్ వేర్.. ఏదైనా సరే సూపర్ గా సెట్ అయ్యే స్టైలిష్ బంగారు గాజుల డిజైన్లు మీకోసం. ఓసారి ట్రై చేయండి. ఇవి పెళ్లిళ్లు, పార్టీలకే కాదు.. రోజువారీ వాడకానికి కూడా చాలా బాగుంటాయి.
బంగారు గాజులను ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. బడ్జెట్ సమస్య లేకుంటే ఎన్ని జతల గాజులైనా కొనడానికి వెనుకాడరు. అమ్మాయిలు. రోజువారీ వాడడానికి, పెళ్లిళ్లు, పార్టీలకనీ సపరేట్ గా బ్యాంగిల్ సెట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే అన్నింటికి సూపర్ గా సెట్ అయ్యే కొన్ని గాజుల డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓసారి ట్రై చేయండి. ఇవి మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. 10 నుంచి 20 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

1) బంగారు గాజులు
రోజువారీ వాడకానికి హెవీ డిజైన్లు వద్దనుకుంటే.. ఇలాంటి సింపుల్ డిజైన్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. ప్లెయిన్ వర్క్ మీద ఎనామిల్ పేయింట్ తో డిజైన్ చేశారు. ఇవి 8-10 గ్రాముల్లో వస్తాయి. వర్కింగ్ ఉమెన్స్ కి, కాలేజి అమ్మాయిలకు చాలా బాగుంటాయి. ఏ డ్రెస్ కి అయినా సూపర్ గా మ్యాచ్ అవుతాయి.

2) బంగారు గాజుల లేటెస్ట్ డిజైన్
డబుల్ లేయర్ లుక్ తో ఉన్న ఈ గాజులు వేసుకుంటే చాలా బాగుంటాయి. మోటిఫ్ వర్క్ తో పాటు చిన్న రాళ్లు పొదిగారు. స్టైలిష్ లుక్ కోసం ఇవి మంచి ఎంపిక. 15-20 గ్రాముల్లో చేయించుకుంటే బాగుంటుంది. బడ్జెట్ సమస్య లేకపోతే కాస్త ఎక్కువ బరువులో కూడా చేయించుకోవచ్చు.
3) 2 తులాల బంగారు గాజులు
అడ్జస్టబుల్ గాజులను ఎవ్వరైనా ఈజీగా పెట్టుకోవచ్చు. హెవీ డిజైన్ గాజులు వేసుకోవడం ఇష్టం లేకపోతే.. ఇలాంటి సింపుల్, ట్రెండింగ్ లో ఉన్న బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. స్టైల్ తో పాటు కంఫర్ట్ కూడా ఉంటుంది. వేసుకుంటే రాణిలా కనిపిస్తారు. ఇవి 2 తులాలు కన్నా తక్కువలో రావు. తక్కువ బరువులో చేయిస్తే లుక్ బాగుండదు.
4) సింగిల్ బ్యాంగిల్
ఎక్కువ గాజులు వేసుకుని బోర్ కొడితే సింగిల్ బంగారు గాజు ట్రై చేయండి. ఇది 7-10 గ్రాముల్లో వస్తుంది. చైన్ లేదా అడ్జస్టబుల్ పద్ధతిలో కూడా చేయించుకోవచ్చు. ఈ సింపుల్ డిజైన్లు ఎవ్వరికైనా బాగా నచ్చుతాయి. బడ్జెట్ సమస్య కూడా ఉండదు.
