పార్టీలకు వెళ్లేటప్పుడు స్మోకీ ఐ మేకప్ వేసుకుంటే ఆ లుక్కే వేరు. చాలా బోల్డ్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తారు. సరైన పద్ధతిలో, కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.. ఇంట్లోనే ప్రొఫెషనల్ క్వాలిటీతో స్మోకీ ఐ మేకప్ వేసుకోవచ్చు. ఎలాగో చూద్దామా..
Smokey Eye Makeup Tips: పార్టీలో అందరికంటే స్పెషల్‌గా, అట్రాక్టివ్‌గా కనిపించాలి అనుకుంటున్నారా? అయితే స్మోకీ ఐ మేకప్ బెస్ట్ ఆప్షన్. ఇది మీ కళ్లకు మంచి లుక్ ని ఇస్తుంది. దాంతో మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ లుక్ కోసం మీరు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. సరైన టెక్నిక్, కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.. ఇంట్లోనే అదిరిపోయే స్మోకీ ఐ లుక్‌ను పొందవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
ప్రైమర్ అప్లై చేయడం
స్మోకీ ఐ మేకప్ కోసం పర్ఫెక్ట్ బేస్ రెడీ చేసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా, మీ కనురెప్పలను శుభ్రం చేసి, ఆ తర్వాత ప్రైమర్ లేదా కన్సీలర్ అప్లై చేయాలి. దీనివల్ల ఐషాడో ఎక్కువసేపు చెదరకుండా ఉంటుంది. రంగులు కూడా చాలా డార్క్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. ఈ స్టెప్ మీ ఐ మేకప్‌నకు స్మూత్, ప్రొఫెషనల్ ఫినిషింగ్ ఇస్తుంది.
ట్రాన్సిషన్ షేడ్ వేయడం
తర్వాత ఐ మేకప్‌ను బ్యాలెన్స్ చేయడానికి ట్రాన్సిషన్ షేడ్ వేయడం చాలా అవసరం. దీనికోసం లైట్ బ్రౌన్, పీచ్ వంటి షేడ్ తీసుకుని కంటి క్రీజ్ ఏరియాలో బాగా బ్లెండ్ చేయాలి. ఈ స్టెప్ వల్ల డార్క్ షేడ్స్‌ను స్మూత్‌గా బ్లెండ్ చేయడం ఈజీ అవుతుంది. దీంతో మీ స్మోకీ ఐ లుక్ చాలా న్యాచురల్‌గా, సాఫ్ట్‌గా కనిపిస్తుంది.
డార్క్ షేడ్స్‌తో మ్యాజిక్
స్మోకీ ఐ అసలు మ్యాజిక్ అంతా డార్క్ షేడ్స్‌లోనే ఉంటుంది. మీ కనురెప్పలపై నలుపు, డార్క్ బ్రౌన్ లేదా చార్‌కోల్ గ్రే ఐషాడోను అప్లై చేయాలి. ముఖ్యంగా కంటి బయటి కార్నర్స్‌లో ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎక్కడా గీతల్లా కనిపించకుండా బాగా బ్లెండ్ చేయాలి. ఈ స్టెప్ కళ్లకు డెప్త్ ఇచ్చి, బోల్డ్, డ్రమాటిక్ లుక్‌ను ఇస్తుంది. పార్టీలకు ఈ లుక్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
కాజల్, ఐలైనర్‌తో హైలైట్
ఇప్పుడు, మీ కళ్లను మరింత హైలైట్ చేయడానికి కాజల్, ఐలైనర్ వాడండి. మీ వాటర్‌లైన్‌పై కాజల్ పెట్టి, స్మోకీ ఎఫెక్ట్ కోసం కొద్దిగా స్మడ్జ్ చేయండి. తర్వాత, పై రెప్పల వెంట సన్నగా ఐలైనర్ లైన్ గీయండి. దీనివల్ల మీ కళ్లు మరింత బోల్డ్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి.
మస్కారా, ఫైనల్ టచ్
చివరగా, మస్కారాతో మీ ఐ మేకప్‌ను పూర్తి చేయండి. ఇది మీ కనురెప్పలు పొడవుగా, దట్టంగా, వంపు తిరిగి కనిపించేలా చేస్తుంది. దాంతో మీ కళ్లు పెద్దవిగా, మరింత అందంగా కనిపిస్తాయి. కావాలంటే ఫాల్స్ లాషెస్ (నకిలీ కనురెప్పలు) కూడా పెట్టుకోవచ్చు. అదనంగా, మీ కళ్ల లోపలి కార్నర్స్‌లో కొద్దిగా హైలైటర్ అప్లై చేస్తే.. గ్లోయింగ్ ఫినిషింగ్ వస్తుంది. మీ స్మోకీ ఐ లుక్ మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది.


