గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, విటమిన్ ఎ, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ ఇచ్చి, కుదుళ్లను బలంగా చేస్తాయి. జుట్టుకు మెరుపును కూడా అందిస్తాయి.
పన్నీర్‌లో ప్రోటీన్, కాల్షియం, బయోటిన్ ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టును బలంగా మార్చి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చుండ్రును కూడా తగ్గిస్తుంది.
పప్పు ధాన్యాల్లో ప్రోటీన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి.
ప్రోటీన్, లాక్టిక్ యాసిడ్, ఫ్యాట్ సమృద్ధిగా ఉండే పెరుగు.. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టు ఆరోగ్యానికి చికెన్ ఒక అద్భుతమైన ప్రోటీన్ ఫుడ్. కెరాటిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు జుట్టును బలంగా మార్చి, చిట్లిపోకుండా కాపాడతాయి.
గుమ్మడి గింజలు, వాటి నూనె జుట్టు రాలడానికి కారణమయ్యే DHT అనే హార్మోన్‌ను నిరోధిస్తాయి.
సోయాలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కెరాటిన్ ఉత్పత్తికి అవసరం. ఇందులో ఐరన్ కూడా ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
Sharbat: నిమ్మకాయ లేకుండా కమ్మని షర్బత్ ఇలా చేసేయండి..!
Potato: ఆలుగడ్డ తొక్కతో సహా తింటున్నారా? ఈ విషయం మీకు తెలుసా?
Apple: యాపిల్ పై మైనం పూత ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
Cooking Oil: వంటకు బెస్ట్ నూనె ఇదే