వేసవిలో ముఖం కాంతి కోల్పోయిందా? కందిపప్పుతో ఈ 5 ఫేస్ ప్యాక్‌లు ట్రై చేస్తే.. టానింగ్, మచ్చలు, పొడిబారిన చర్మాన్ని తొలగించి, మెరుపును తెస్తాయి.
వేసవిలో ముఖం పొడిబారి, కళ తగ్గిపోయి , నీరసంగా కనపడుతున్నారా? ఎండ వల్ల ఫేస్ కూడా ట్యాన్ అయిపోయిందా?. అందుకే వేసవిలో చర్మానికి రక్షణ చాలా అవసరం. మీ ఇంట్లో ఉండే కందిపప్పుతో 4 రకాల ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటే చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది, మెరుపు వస్తుంది, మచ్చలు తగ్గుతాయి, టానింగ్ కూడా పోతుంది.
- కందిపప్పు, పసుపు ఫేస్ ప్యాక్ (టాన్ తొలగించడానికి)
2 స్పూన్లు కందిపప్పు (రాత్రంతా నానబెట్టినవి లేదా పిండి)
1 చిటికెడు పసుపు
1 స్పూను పాలు లేదా పెరుగు
తయారీ విధానం
అన్ని పదార్థాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి 15-20 నిమిషాలు పట్టించాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్ టానింగ్, మురికిని తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
2. కందిపప్పు, తేనె ఫేస్ ప్యాక్ (పొడి చర్మానికి)
2 స్పూన్లు కందిపప్పు పిండి
1 స్పూను తేనె
1 స్పూను పాలు
తయారీ విధానం
అన్ని పదార్థాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత మసాజ్ చేస్తూ కడగాలి. ఈ ప్యాక్ చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది.
3. కందిపప్పు, నిమ్మరసం ఫేస్ ప్యాక్ (మొటిమలకు)
1 స్పూను కందిపప్పు పిండి
1 స్పూను నిమ్మరసం
1 స్పూను గులాబీ నీరు
తయారీ విధానం
కందిపప్పు పిండి, నిమ్మరసం, గులాబీ నీరు కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇది మొటిమలు, జిడ్డు చర్మానికి మంచి ఫేస్ ప్యాక్.
4. కందిపప్పు, మలై ఫేస్ ప్యాక్ (మెరిసే చర్మానికి)
2 స్పూన్లు కందిపప్పు పిండి
1 స్పూను పాలమీగడ
తయారీ విధానం
కందిపప్పు, మలై కలిపి పేస్ట్ చేయాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి 15-20 నిమిషాలు పట్టించాలి. తర్వాత వృత్తాకారంలో రుద్దుతూ కడగాలి. ఈ ప్యాక్ ముఖానికి మెరుపు, మృదుత్వాన్నిస్తుంది.
5. కందిపప్పు, టమాటా ఫేస్ ప్యాక్ (నల్ల మచ్చలకు)
1 స్పూను కందిపప్పు పిండి
1 స్పూను టమాటా రసం
1 చిటికెడు పసుపు
తయారీ విధానం
కందిపప్పు పిండి, టమాటా రసం, పసుపు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఇది నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.