MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • Face Glow: పాలు ఇలా చేసి ముఖానికి రాస్తే, ఫేషియల్ అవసరమే రాదు..!

Face Glow: పాలు ఇలా చేసి ముఖానికి రాస్తే, ఫేషియల్ అవసరమే రాదు..!

ఎండాకాలంలో ఎక్కువ చెమట, ఎండ, మురికి వల్ల ముఖం దెబ్బ తింటుంది. దీని వల్ల ఫేస్ మీద ఎక్కువగా మొటిమలు, ముడతలు, బ్లాక్ సర్కిల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. వీటిని మనం పాలతో చేసిన ఐస్ క్యూబ్స్ వాడి చెక్ పెట్టేయవచ్చు

2 Min read
Author : ramya Sridhar
Published : May 23 2025, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెరిసే అందం కోసం..
Image Credit : our own

మెరిసే అందం కోసం..

వయసు పెరుగుతుంటే మన ముఖంలో మార్పులు రావడం చాలా సహజం. నెమ్మదిగా ముఖంపై ముడతలు రావడం మొదలౌతుంది.ఫేస్ లో గ్లో కూడా తగ్గుతుంది. వీటికి తోడు ఎండాకాలం వచ్చింది అంటే ఫేస్ లో ట్యాన్ కూడా పెరిగిపోతుంది. ఈ సమస్యలన్నీ తగ్గి.. అందంగా కనిపించాలి అంటే పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకోవాలి.. లేదంటే వేల రూపాయలు ఖరీదు చేసే మేకప్ ప్రొడక్ట్స్ వాడాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. కేవలం మన ఇంట్లో లభించే పాలతో మన సమస్యలన్నింటికీ చెక్ పెట్టచ్చని మీకు తెలుసా? అయితే, ఆ పాలను మనం మన ముఖానికి ఎలా వాడాలి అనేది మాత్రం తెలుసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెస్ట్ సొల్యూషన్..
Image Credit : pinterest

బెస్ట్ సొల్యూషన్..

ఎండాకాలంలో ఎక్కువ చెమట, ఎండ, మురికి వల్ల ముఖం దెబ్బ తింటుంది. దీని వల్ల ఫేస్ మీద ఎక్కువగా మొటిమలు, ముడతలు, బ్లాక్ సర్కిల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. వీటిని మనం పాలతో చేసిన ఐస్ క్యూబ్స్ వాడి చెక్ పెట్టేయవచ్చు. అంతేకాదు.. మునుపటి కంటే ముఖం ఎక్కువగా మెరుస్తూ కనపడుతుంది కూడా.

35
పాల ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేయాలి? ముఖానికి ఎలా వాడాలి?
Image Credit : Freepik

పాల ఐస్ క్యూబ్స్ ఎలా తయారు చేయాలి? ముఖానికి ఎలా వాడాలి?

ముందుగా ¾ కప్పు చల్లని పాలు తీసుకోవాలి. దీనిలో పావు కప్పు నీరు కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ లో వేసి కనీసం 4 నుంచి 5 గంటల వరకు ఫ్రీజ్ చేయాలి. ఇలా ఫ్రీజ్ చేసిన ఐస్ క్యూబ్స్ ని సున్నితంగా ముఖంపై రుద్దాలి. ముఖాన్ని మాత్రమే కాదు.. మెడపై కూడా సున్నితంగా రుద్దాలి. అరగంట తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. వరసగా రెండు వారాలు ఇలా చేసినా మీ ముఖంలో వచ్చిన మార్పులు మీరు క్లియర్ గా చూడగలరు.

45
పాల ఐస్ క్యూబ్స్ తో మనకు కలిగే ప్రయోజనాలు...
Image Credit : our own

పాల ఐస్ క్యూబ్స్ తో మనకు కలిగే ప్రయోజనాలు...

చర్మానికి సహజ గ్లో అందిస్తుంది

పాలులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. ఇది సహజమైన మెరుపు, నిగారింపును తీసుకువస్తుంది.

మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది

పాల ఐస్ క్యూబ్స్ చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ముఖంపై పేరుకుపోయిన మురికిని బయటకు తీస్తాయి. దీంతో మొటిమల సంఖ్య తగ్గుతుంది.

బ్లాక్ సర్కిల్స్ తగ్గిస్తాయి..

కళ్ల చుట్టూ చాలా మందికి బ్లాక్ సర్కిల్స్ వచ్చి అందవిహీనంగా కనపడతాయి.అంతేకాదు సరిగా నిద్రలేకపోతే కళ్లు ఉబ్బుతాయి. ఇలాంటి సమస్యలకు ఈ పాల ఐస్ క్యూబ్స్ చెక్ పెడతాయి.పాలలోని పోషకాలు చర్మానికి పోషణను అందిస్తూ, నల్లటి వలయాలను తగ్గిస్తాయి.

చర్మం బిగుతుగా మారుతుంది

ఐస్ వల్ల చర్మం గట్టిపడుతుంది. పొడిగా ఉండే వారికీ తేమను అందిస్తుంది.చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది.

55
గమనిక...
Image Credit : our own

గమనిక...

పాలకు అలర్జీ ఉన్న వారు మొదట చిన్న భాగంలో పరీక్షించండి.ఎలాంటి ప్రాబ్లం రాకపోతేనే ముఖంపై ప్రయత్నించాలి. అంతేకాదు.. ఐస్ ని ఎప్పుడూ డైరెక్ట్ గా ముఖంపై రుద్దకూడదు. ఏదైనా చిన్న వస్త్రంలో ఉంచి.. దానితో అప్లై చేయాలి. వారానికి కనీసం 3 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
సౌందర్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Hair Care: మెంతుల్లో ఇదొక్కటి కలిపి రాస్తే, జుట్టు పొడుగ్గా పెరుగుతుంది..!
Recommended image2
Face Glow: 40 ఏళ్లు దాటినా ముఖంపై ముడతలు రావద్దంటే, ఇదొక్కటి రాస్తే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved