MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్, ఎందుకో తెలుసా?

Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్, ఎందుకో తెలుసా?

వీరికి ఎప్పుడూ ఒకేలా ఉండటం నచ్చదు. వారి మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. చంచలంగా ఉంటుందని చెప్పొచ్చు. వీరు ఒకే చోట కదలకుండా ఉండటాన్ని ఇష్టపడరు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 22 2025, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నెంబర్ 5
Image Credit : Freepik

నెంబర్ 5

జోతిష్యం ఆధారంగా వ్యక్తి భవిష్యత్తు ఎలా తెలుసుకోవచ్చో..న్యూమరాలజీ ప్రకారం, మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం, ప్రవర్తన తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, మూడు ముఖ్యమైన తేదీల్లో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం.

న్యూమరాలజీ ప్రకారం, ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. వీరిపై బుధ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, సృజనాత్మకతకు ప్రతీక. ఈ తేదీల్లో జన్మించిన వారు జీవితంలో ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొత్తదనం కోసం పరుగులు తీస్తూ ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
  చంచలమైన మనస్సు..
Image Credit : Freepik

చంచలమైన మనస్సు..

నెంబర్ 5 కి చెందిన వ్యక్తులు స్థిరత్వాన్ని ఇష్టపడరు. వీరికి ఎప్పుడూ ఒకేలా ఉండటం నచ్చదు. వారి మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. చంచలంగా ఉంటుందని చెప్పొచ్చు. వీరు ఒకే చోట కదలకుండా ఉండటాన్ని ఇష్టపడరు. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. కొత్త కొత్త ప్రదేశాల్లో చుట్టి వస్తూ ఉంటారు.

36
మాటల మాంత్రికులు..
Image Credit : Freepik

మాటల మాంత్రికులు..

ఈ సంఖ్యకు చెందినవారు మాటలలో నిపుణులు. వారి సంభాషణ శైలి ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి మాటలు బానే ఉంటాయి కానీ, ఆలోచనా విధానమే భిన్నంగా ఉంటుంది. ఏదీ తొందరగా నిర్ణయం తీసుకోరు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. అయితే.. వీరు ఎక్కడ ఉన్నా సందడి చేస్తారు. అందరిలోనూ ఉత్సాహం నింపుతారు.

ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ..

నంబర్ 5 వ్యక్తులు అందరితో సులభంగా కలిసిపోతారు. వారి హాస్యం, ఉల్లాసం ఇతరులను ఆకర్షిస్తాయి. ప్రత్యేకంగా 1, 3, 6 తేదీలలో జన్మించినవారితో గాఢమైన స్నేహం ఏర్పడుతుంది. ఈ బంధాలు ఆత్మీయతతో పాటు సాహసానికి ప్రేరణనిస్తాయి.

46
వీరిలో ఉన్న నెగిటివ్స్..
Image Credit : Freepik

వీరిలో ఉన్న నెగిటివ్స్..

ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. కానీ.. వీరికి చాలా తొందరగా విసుగు వచ్చేస్తుంది. ఏదైనా పని ఎక్కువ సేపు చేయాలి అంటే వీరికి విసుగు వచ్చేస్తుంది. ఇలాంటప్పుడే అసహనంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త సహనం పెంచుకున్నా, దూర దృష్టి పై ఫోకస్ పెట్టినా వీరి జీవితం ఇంకా బాగుంటుంది.

ఏ రంగంలో బాగా రాణిస్తారంటే...

వారి బలమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా, మార్కెటింగ్, మీడియా, సేల్స్, ప్రకటనలు వంటి రంగాల్లో వారు రాణించగలరు. ప్రయాణాలపై ఆసక్తి ఉన్నందున టూరిజం, జర్నలిజం వంటివి కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రజలతో కలవడం, మెసేజ్‌ను సమర్థంగా చేర్చడం వంటివి వారి ప్రత్యేకతలు.

56
అదృష్టాన్ని తెచ్చేవి..
Image Credit : Freepik

అదృష్టాన్ని తెచ్చేవి..

బాగా కలిసొచ్చే రంగులు: ఆకుపచ్చ, లేత నీలం

అదృష్ట రోజులు: బుధవారం, శుక్రవారం

ప్రత్యేక మంత్రం: "ఓం బుధాయ నమః"

అదృష్ట రత్నం: ఎమెరాల్డ్ (పచ్చ రత్నం)

66
చివరగా..
Image Credit : Freepik

చివరగా..

సంఖ్యాశాస్త్రం మనకు ఒక దారిని చూపిస్తుంది, కానీ దాన్ని అనుసరించి జీవితం చక్కదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. 5వ తేదీలో జన్మించినవారు శక్తివంతంగా ఉంటారు. మార్పు, సృజనాత్మకత , ఉల్లాసానికి ప్రతిరూపం. సరైన దిశలో ఆ శక్తిని నడిపించగలిగితే, వారు నిజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయగల వారు అవుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టిన వారికి తిరుగులేదు, పేరు, డబ్బు వాటంతట అవే వస్తాయి
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు భార్యను బాగా ప్రేమిస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved