మోహినీ అవతారంలో శ్రీనివాసుడు
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా.... మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
మోహినీ అలంకారం విశిష్టత..
మోహినీ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని శ్రీవారు తెలియజేస్తున్నారు. తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని చాటి చెబుతున్నారు.