Asianet News TeluguAsianet News Telugu

పాప్ కార్న్ చేస్తుంటే పేలిన సిలిండర్ : ఇద్దరి పరిస్థితి విషమం (వీడియో)

పాప్ కార్న్ చేస్తుంటే పేలిన సిలిండర్ : ఇద్దరి పరిస్థితి విషమం

తిరుపతిలోని కొర్లగుంటలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి  విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐదుగురు యువకులు కొర్లగుంటలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ పాప్ కార్న్ తయారు చేసి వీధుల విక్రయిస్తుంటారు. ఈ ఉదయం గ్యాస్ స్టవ్ వెలిగించే సమయంలో అప్పటికే లీక్ అవుతున్న  సిలిండర్ ఒక్కసారిగా పేలింది. సిలిండర్ పేలుడుకు ఇంటిలోని వంటగది గోడ కూలిపోయింది. వంట గది వద్ద ఉన్న ఇద్దరు యువకులు సుమిత్ , అమిత్ లకు తీవ్ర గాయాలు కాగా,  మరో ముగ్గురు రాజ్ కపూర్, ఆశిష్, అంబరీష్ అనే యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్లో వీరిని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది.